twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు-ఢీ అంటే ఢీ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు రేపు(జూలై 29) జరుగనున్న నేపథ్యంలో చిన్న నిర్మాతల అభ్యర్థి తమ్మారెడ్డి భరద్వాజ ప్రత్యర్థి వర్గంపై ఫైర్ అయ్యారు. 'దళారీ వ్యవస్థ కారణంగా సినీ పరిక్షిశమలో చిన్న నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంతా అన్యాయమైపోతున్నారు. ఫిలిం ఛాంబర్ ఏ ఒక్కరి సొత్తుకాదు. కొంత మంది ఛాంబర్‌ని ఆక్రమించి తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. వారి కబంధ హస్తాల నుంచి ఛాంబర్‌ని, చిత్ర పరిక్షిశమని కాపాడటం కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం' అన్నారు.

    ఇంతకు ముందు రాష్ట్రంలో 3 వేల థియేటర్లు వుండేవి. కానీ కొంత మంది గుత్తాధిపత్యం కారణంగా వాటి సంఖ్య 1700లకు పడిపోయింది. చిన్న సినిమా విడుదల చెయ్యాలంటే థియేటర్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఐదుగురి గుత్తాధిపత్యం కారణంగా చిన్న సినిమా మనుగడకే ముప్పువాటిల్లుతోంది. ఇప్పటి వరకు ఛాంబర్‌లో కొనసాగుతున్న వారు చిన్న నిర్మాతల కోసం చేసిందేమి లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మంచి కోసం ముందు కొచ్చిన మా ప్యానెల్‌ని గెలిపించాలని నిర్మాతలని కోరుకుంటున్నాను' అన్నారు.

    ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కోసం తమ్మాడ్డి భరద్వాజ, స్రవంతి రవికిషోర్ పోటీపడుతున్నారు. రవికిషోర్‌కు సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాతలు మద్దతు ఇస్తున్నారు. తమ్మారెడ్డికి చిన్ననిర్మాతలు, దాసరి నారాయణరావు లాంటి వారు సపోర్టు ఇస్తున్నారు. అయితే పెద్ద నిర్మాతల ప్యానెల్ ప్రలోభాలకు గురి చేస్తూ గెలుపుకోసం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. మరి గెలుపు ఎవరిదో...కొన్ని రొజుల్లో తేలనుంది.

    English summary
    New president for Andhra Pradesh Chamber of Commerce will be elected this Sunday. Two panels led by Tammareddy Bharadwaj and Sravanthi Ravikishore are competing in the elections. While Dasari Narayana Rao and his group is backing Tammareddy Bharadwaj, the power fill group of producers like Suresh Babu, Allu Aravind and others are leading support to Sravanthi Ravikishore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X