For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రభాస్‌‘రెబల్’పై ఆపోలో డాక్టర్స్ నిరసన

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా 'రెబల్' టైటిల్ తో క్రితం శుక్రవారం ఓ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పోస్టర్స్ చూసిన అపోలో డాక్టర్స్ సీరియస్ అయ్యారు. సిగరేట్ కాలుస్తున్నట్లు పోస్టర్లు ప్రదర్శించడంపై అపోలో క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు, వైద్యవిద్యార్థులు బంజారాహిల్స్‌లోని సినీమ్యాక్స్ వద్ద నిరసనకు దిగారు. ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సినీమ్యాక్స్ మేనేజ్‌మెంట్‌ను స్మోకింగ్ చేస్తూ ఉన్న బ్యానర్లను తొలగించాలని కోరారు.

  అనంతరం అక్కడినుంచి ఆ డాక్టర్స్ అంతా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్-44ఏలో ఉన్న ప్రభాస్ నివాసానికి వెళ్లగా..ఆయన లేకపోవడంతో ప్రభాస్ సమీప బంధువు సత్యనారాయణరాజుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ ఆస్పత్రి డెరైక్టర్ డాక్టర్ విజయ్‌ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ పోస్టర్లపై, సినిమాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని చూపించడం వల్ల యువత పెడదోవ పట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. హీరోలు అభిమానుల బాగుకు ప్రయత్నం చేయకపోయినా, చెడు చేసే చర్యలకు దయచేసి పాల్పడవద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు.

  ఇక ప్రబాస్ 'రెబల్'చిత్రం విడుదలైన రోజు నుంచి ఏదో ఒక సమస్య వస్తోంది. ఈ చిత్రం విడుదలైన మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే టాక్ ఎలా ఉన్నా అభిమానులతోనూ, వీకెండ్ లో చూసే వారితోనూ, మొదటే రిజర్వ్ చేసుకున్న వారితోనూ మొదటి మూడు రోజులు కలెక్షన్స్ సాధారణంగా ఫిల్ అవుతూంటాయి. అయితే 'రెబల్'కి నైజాం ఏరియాలో ఆ అదృష్టం లేదంటున్నారు. 29(శనివారం) గణేష్ నిమజ్జనం రావటం,30(ఆదివారం)తెలంగాణా మార్చ్ రావటంతో ధియోటర్స్ వెలా తెలా పోయాయి. ముఖ్యంగా 30 న ధియోటర్స్ క్లోజ్ చేసేసారు. అలాగే సోమవారం(అంటే ఈరోజు)తెలంగాణా బంద్ ఎఫెక్టు కూడా పడింది.

  అయితే ట్రిమ్ చేసిన వెర్షన్ తో రాబోయే రోజుల్లో ఏమన్నా కలెక్షన్స్ పికప్ అవుతాయేమోననే ఆశ మాత్రం ఉందని ట్రేడ్ లో వ్యాఖ్యానిస్తున్నారు. భారీ రేట్లకు కొన్న 'రెబల్'డిస్ట్రిబ్యూటర్స్ తమ డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయా,రావా అనే డైలామోలో పడినట్లు చెప్పుకుంటున్నారు. కొంతలో కొంత ఓపినింగ్స్ బాగుండటం ఈ సినిమాు కలిసి వచ్చిన అంశం. అయితే ప్రభాస్ మాత్రం ఈ చిత్రం విజయంపై ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు.

  English summary
  Dr. Vijay Anand Reddy, Cancer specialists & Director, Apollo Cancer Hospital, representing ‘Voice of tobacco victims in the state of Andhra Pradesh’ and Medical Students staged a Gandhian protest at Cinemax Theatre & Prabhas residence on Tuesday against ‘REBEL’ movie & its Hero Prabhas, for openly promoting cigarette smoking as seen in the movie posters and exhibits, which is against the COTPA (Cigarettes & Other Tobacco Products Act). They handed over a memo to Mr Satyanarayana Raju, uncle of Prabhas (as Prabhas was not at home) and through him requested Prabhas to desist from promoting smoking, A copy of the memo was handed over to the Cinemax Theatre authorities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X