»   » ఈ దెబ్బతో ఆ హీరో ఎక్కువ హైలైట్ అయిపోతున్నాడు...

ఈ దెబ్బతో ఆ హీరో ఎక్కువ హైలైట్ అయిపోతున్నాడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అప్పల్రాజు"ని అడ్డం పెట్టుకుని రామూ ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో 'అప్పల్రాజు"ని ఆయుదంగా చేసుకొని సినీజనాన్ని తనెంతగా గుచ్చుతున్నాడ్ ఆల్ రెడీ ఆ సినిమా స్టిల్స్, బ్రోచర్ ప్రూవ్ చేసేశాయి. దాంతో రామ్ గోపాల్ వర్మ సిల్వర్ స్క్రీన్ పైకి పంపుతోన్న ఆ 'అప్పల్రాజు" ముందు ముందు ఎవరికెన్ని తిప్పలు తెచ్చిపెడతాడో..ఎన్ని వివాదాలకు తెరతీస్తాడోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే వెలుగులోకి వచ్చిన మరో ముఖ్య విశేషం ఏంటంటే మాస్ రాజా రవితేజ 'అప్పల్రాజు"లో అతిథి పాత్రను పోషించారట.

అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకూ రామూ కానీ, రవితేజకానీ అధికారికంగా దృవీకరించలేదు..అలాగని ఖండించనూ లేదు. ఇక ఇండస్ట్రీ పీపుల్ కి ఆమాత్రం గ్యాప్ దొరికితే చాలుగా..అప్పల్రాజు"లో రవితేజ గెస్ట్ రోల్ చేసిన మాట నిజమేననీ, అప్పల్రాజు" సంక్రాంతికి వస్తుందన్నారు. కనుక తన 'మిరపకాయ్"ని డిసెంబర్ ఎండింగ్ లోనే రిలీజ్ చెయ్యాలనుకున్నాడనీ, ఇప్పుడు అప్పుల్రాజు" రిలీజ్ లేనందునే 'మిరపకాయ్"ని సంక్రాంతికి జరిపాడనీ..ఇలా ఎవరికి వారు తమ మేథస్సు మేరకు తోచిన కథనాన్ని తొణక్కుండా చెప్పేసుకుంటున్నారు. మొత్తానికీ చర్చల్లో రవితేజ ఎక్కువ హైలైట్ అయిపోయి అప్పల్రాజు" వివాదాల టాపిక్ డీవియెట్ అయిపోవడం గమనార్హం..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu