»   » టాలీవుడ్ ఇండస్ట్రీని భయపెడుతున్న అప్పల్రాజు...

టాలీవుడ్ ఇండస్ట్రీని భయపెడుతున్న అప్పల్రాజు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పల్రాజు సినిమా స్టార్ట్ అయినప్పటినుంచి ఏదో విధంగా వార్తల్లో నానుతున్న ఈ చిత్ర మళ్ళీ ఇప్పుడు వర్తల్లోకి వచ్చింది. ఈ మద్య విడుదల చేసిన కొన్ని ఫోటోలు చూసి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకుంటున్నారు. అన్ని క్యారక్టర్లు తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోలకి, దర్శకులకి సంబందించినవే అని అంటున్నారు. ఇప్పుడే ఇలా వుంటే సినిమా విడుదలైతే ఇంకా ఎలాంటివి చూడాల్సి వస్తుందో అని తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులు భయపడుతున్నారని సమాచారం. అదే గనుక నిజమైతే ఆయా హీరోల ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మకి బాజాబజంత్రీలు వాయించేస్తారు.

అయితే అప్పల్రాజు మాత్రం రొటీన్ సినిమాలు చూసి చూసి విసిగిపోయి నేనే ఓ అద్భుతమైన సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాను. ఒక మంచి కథతో, హృదయానికి హత్తుకునే క్యారెక్టర్లతో సినిమా తీస్తే ఎందుకు సూపర్ హిట్ అవదో మీ అందరికీ తెలియజేయాలన్న నా ఆశ. మీరు ఎప్పుడూ చూసే విధంగా వర్షం పాటలు, పనికిమాలిన సెట్లు, అర్థంలేని ఫైట్లు, అవసరం లేని ఫారిన్ లొకేషన్లు కాకుండా హార్ట్ టచింగ్ ఎమోషన్లు ఎక్స్ టార్డినరీ ఫెర్ఫార్మెన్స్ లు ఉంటాయి. అండర్ కరెంట్ గా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా.

ఇది మీ అందరికి నా తరపున సంక్రాతి కానుక. ఈ గొప్ప సెంటిమెంట్ సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్లీ ఈ సినిమా వందరోజుల ఫంక్షన్లో తప్పకుండా కలుద్దాం. మీ అందరికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు....ఇట్లు మీ అప్పల్రాజు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu