»   » "అప్పట్లో ఒకడుండేవాడు" ఇప్పుడు ఎప్పటికీ ఉంటాడు., ఎలా అంటే......

"అప్పట్లో ఒకడుండేవాడు" ఇప్పుడు ఎప్పటికీ ఉంటాడు., ఎలా అంటే......

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని సినిమా టైటిల్లు క్యాచీగా ఉంటాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ శీర్శికలని వాడుకునేంత గా ఆకర్షిస్తాయి. ఇద్దరు రాజకీయ నాయకుల భేటీలకు "ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు" అంటూ ఇప్పటికీ ఆ టైటిల్ ని వాడుతూనే ఉన్నారు.ఇలా "ఆ నలుగురు, బొమ్మరిల్లు, పోకిరి, అతడు, గబ్బర్ సింగ్, నిన్నే పెళ్లాడుతా,పెళ్ళైన కొత్తలో,పెళ్లి చూపులు,ఇడియట్,దేశ ముదురు, బాహుబలి,ఈగ , మర్యాద రామన్న " సినిమా లకు జరిగింది.

అప్పట్లో ఒకడుండే వాడు అయ్యారే వంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా సాగర్ చంద్ర తన రెండో ప్రయత్నంగా చేసిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు గత కొన్నిరోజులుగా టాలీవుడ్ లో చర్చనీయంశంగా మారింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు అన్నీ కూడా ఆసక్తిగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా రెండు రోజులుగా ఒక మానియా లా తయారయ్యింది. మొదత సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ తో పాత ఫొటోలను పోస్ట్ చేయటం మొదలు పెట్టటం తో సాయంత్రం లోపు దాదాపు ప్రతీ వాల్ మీదా తమ పాత ఫొటోలను పెట్టటం మొదలయ్యింది.

ఇక ఇప్పుడు అప్పట్లో ఒకడుండేవాడు సోషల్ మీడియానుంచి మీడియాకెక్కాడు. ఈ రోజు గ్యాంగ్స్టర్ నయీం వ్యవహారం పై టీవీ9 ప్రసారం చేసిన ఒక అరగంట ప్రోగ్రాం కి అప్పట్లో ఒకడుండేవాడు అని టైటిల్ పెట్టటం ఈ చిన్న సినిమా ఎంత ప్రభావం చూపిందో చెప్పటానికి నిదర్శనం. ఇంత గా జనం లోకి వెర్ళ్లటానికి కారణం ఈ సినిమా మేకర్స్, డైరెక్టర్ ఎంచుకున్న మార్గమే..

Appatlo Okadundevadu movie Title for media articles

కొద్ది రోజులనుంచీ సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకున్నారు ఈ సినిమాలోని నటుల చిన్నప్పటి ఫొటోలతో అప్పట్లో ఒకడుండే వాడు అంటూ ఒక కాంపిటీషన్ నిర్వహింజ్చినప్పుడే జనం లో ఒకవిధమైన క్యూరియా సిటీ కలిగించారు. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా మార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరించటం లో ఇప్పటి యువకులు ఎలా ఆలోచిస్తున్నారో ఇక్కడ తెలిసి పోతుంది.

క్రికెటర్ అవ్వాలనుకొనే రైల్వే రాజు(శ్రీ విష్ణు) కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల గ్యాంగ్ స్టార్ గా మారతాడు . అలా గ్యాంగ్ స్టార్ గా మారిన రైల్వేరాజు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ(నారా రోహిత్) ను డీ కొడతాడు. ఇంతకీ క్రికెటర్ గా ఎదగాలనుకున్న రైల్వే రాజు గ్యాంగ్ స్టార్ గా మారడానికి కారణం ఏమిటి? అసలు రైల్వే రాజ్ కి ఇంతియాజ్ కి మధ్య ఏం జరిగింది? అన్న పాయింట్ మీద తిరిగిన సినిమా ఈ సంవత్సరానికి ఆఖరి సూపర్ హిట్ అని చెప్పొచ్చు ఇదే సంవత్సరం వచ్చిన పెళ్ళి చూపులూ.., ఇప్పుడు అప్పట్లో ఒకడుండే వాడు. సినిమాకి కావాల్సింది కేవలం డబ్బు, పెద్ద స్టార్లూ...విదేశీ లొకేషన్లూ అన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసాయి.

English summary
Young Director Sagar Chandra latest Movie with Nara Rohit "appatloa okadundevaadu" creating a sensation.. Today a TV channel used the Tittle for their program
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu