»   »  ఆంధ్ర దేశంలో ఉన్న అందరికీ అనిపిస్తుందట

ఆంధ్ర దేశంలో ఉన్న అందరికీ అనిపిస్తుందట

Posted By:
Subscribe to Filmibeat Telugu


చిరుత హీరో రామ్ చరణ్ తేజ్ తో సినిమాను జనవరిలోనే మొదలవుతుందని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమా కోసం కసరత్తు ఇంకా ఊపందుకోలేదని ఆయన తెలిపాడు. ఈ సినిమా తరువాత మరిన్ని సినిమాలకు దర్శకత్వం వహించాల్సి ఉందని రాజమౌళి చెప్పాడు. నిర్మాత అవతారం ఎత్తి నూతన దర్శకులకు అవకాశం ఇస్తానని అంటున్నాడు.

సినిమా తెరపై కనిపించాలని ఆంధ్రదేశంలో ఉన్న అందరికీ అనిపిస్తుందని...నాకు కూడా అనిపించడం సహజమే కదా..అందుకే ముందుముందు నటించే అవకాశాలు కూడా ఉన్నాయి...అయితే హీరోగా మాత్రం కాదు..చిన్న చితక పాత్రలలో కనిపిస్తాను...సినిమా రంగంలో హీరోగా చేయడం సంగీత దర్శకుడిగా మెప్పించడం అంత సులువు కాదు..అది అందరితో సాధ్యమయ్యే పని కాదు...అని అంటున్నాడు రాజమౌళి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X