»   » జగపతి బాబు రొమాంటిక్‌‌గా రెచ్చిపోయాడు (ఫోటోలు)

జగపతి బాబు రొమాంటిక్‌‌గా రెచ్చిపోయాడు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జగపతి బాబు, భూమిక, రణధీర్, సృష్టి ప్రధాన పాత్రధారులుగా కర్తాళ్ ప్రొడక్షన్స్, సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం 'ఏప్రిల్ ఫూల్'. కె.ఎస్.ఎ. దర్శకత్వంలో జి.ఎల్.శ్రీనివాస్, సీమా అజారుద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత జి.ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ జగపతి బాబు, భూమికలు జంటగా మా బేనర్లో సోషియె ఫాంటసి అబ్సర్డ్ కామెడీగా రూపొందిన చిత్రం 'ఏప్రిల్ ఫూల్'. ఈ చిత్రం‌లో హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే చక్కటి సన్నివేశాలు నవ్వులు కురిపించటమే కాక కొత్త ఉంటాయని తెలిపారు.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వివరాలు, ఫోటోలు....

లెజెండ్ తర్వాత వస్తున్న సినిమా...

లెజెండ్ తర్వాత వస్తున్న సినిమా...

‘లెజెండ్' చిత్రంలో నటుడుగా తన ప్రతాపాన్ని మరోసారి వైవిద్యంగా చూపించిన జగపతి బాబు ఈ చిత్రంలో చాలా అందంగా ఉంటూ తన అద్భుతమైన నటనను చూపించారని నిర్మాత తెలిపారు.

ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..

ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా..

ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తూ ఊహించని ట్విటస్ట్‌లు ఈ చిత్రంలో ఉంటాయని, అలాగే చాలా గ్యాప్ తర్వాత భూమిక తన అందమైన నటన ప్రదర్శించింది అన్నారు నిర్మాత.

కెమెరా వర్క్ సూపర్

కెమెరా వర్క్ సూపర్

తనికెళ్ల రాజేంద్రప్రసాద్ తన అందమైన కెమెరా వర్క్‌ని ఈ చిత్రంలో చూపించారని, బంటి అందించిన ఆడియోకి ఇప్పటికే మంచి స్పంద వస్తోందని జి.ఎల్. శ్రీనివాస్ తెలిపారు.

విడుదల తేదీ...

విడుదల తేదీ...

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 10న సినిమాను విడుదల చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో జగపతి బాబు, భూమిక, గుల్షన్ గ్రోవర్, రణధీర్, శ్రుతి, రాళ్లపల్లి, ప్రీతి, వైజాగ్ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి నిర్మాత: జి.ఎల్.శ్రీనివాస్, దర్శకత్వం: డా.కె.ఎస్.ఐ కెమోరా: తనికెళ్ల రాజేంద్రప్రసాద్, సంగీతం: బంటి, లిరిక్స్: బి. మధు, ఎడిటర్: సి.జి.గుహ, ఆర్ట్: రాజీవ్ నాయర్.

English summary
Bhumika Chawla, Jagapathi Babu new movie April Fool releasing on May 10.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu