For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్‌తో కల నెరవేరింది.. స్పైడర్ తర్వాత సౌత్ సూపర్‌స్టార్.. నేషనల్ అవార్డు ఖాయం.. మురుగదాస్

  By Rajababu
  |

  ప్రిన్స్ మహేశ్‌బాబుతో ఏ దర్శకుడు పనిచేసినా ఆయనపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేరు. ప్రస్తుతం మహేశ్‌బాబు నటించిన స్పైడర్ చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, ప్రిన్స్ మహేశ్ తొలిసారి జతకట్టారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ నేపథ్యంలో దర్శకుడు మురగదాస్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా మహేశ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన స్పైడర్, మహేశ్ గురించి మురుగదాస్ ఏమన్నారో ఆయన మాట్లాల్లోనే..

  తుపాకీ రీమేక్‌లో..

  తుపాకీ రీమేక్‌లో..

  పోకిరి విడుదలైన సమయంలో 2006లో మహేశ్‌బాబును తొలిసారి కలిశాను. అప్పుడు తుపాకీ సినిమా కథ తొలి భాగమే పూర్తయింది. అయితే తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయాలని అనుకొన్నాను. ఎందుకో వర్కవుట్ కాలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత మహేశ్‌తో కలిసి పనిచేయాలన్న కల నెరవేరింది. అందుకు మహేశ్‌బాబుకు థ్యాంక్స్.

  యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్..

  యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్..

  స్పైడర్ విషయానికి వస్తే మహేశ్, ఎస్‌జే సూర్య మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. సాధారణంగా పవర్‌ఫుల్ విలన్‌ను హీరో ఢీకొనడం చూస్తుంటాం. అందుకు ప్రకాశ్ రాజ్ లాంటి శక్తిమంతమైన నటులను ఎంచుకొంటాం. కానీ ఈ సినిమాలో హీరో, విలన్ల మధ్య కథ.. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా ఉంటుంది. కనిపించని శత్రువుతో హీరో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ తరహా సన్నివేశాలు ఆడియెన్స్‌ను థ్రిల్ గురిచేస్తాయి.

  మహేశ్‌ది ప్రత్యేకమైన..

  మహేశ్‌ది ప్రత్యేకమైన..

  నా కెరీర్‌లో ఎంతో మంది హీరోలతో పనిచేశాను. ప్రతి ఒక్కరిది ఒక్కో తరహా. కానీ మహేశ్‌బాబు ప్రత్యేకమైన వ్యక్తి. ప్రతీ డైరెక్టర్ తమ జీవితంలో ఒక్కసారైనా మహేశ్‌తో కలిసి పనిచేయాలి. నటన పట్ల అంకితభావం అమోఘం. దర్శకుడికి ఏం కావాలన్నా అది ఎంత కష్టమైనా ఇచ్చేస్తాడు.

  అంకితభావం అమోఘం..

  అంకితభావం అమోఘం..

  మహేశ్ అంకితభావం ఎలాంటిది అనే విషయం గురించి ఓ సంఘటన చెబుతాను. తొలుత స్పైడర్ తమిళ వెర్షన్ కోసం మహేశ్‌కు డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్టును పెట్టాం. దాదాపు ఆరుగురిని పరీక్షించాం. కానీ వారి వాయిస్ మాకు సంతృప్తి పరుచలేదు.

  15 రోజులు కష్టపడ్డారు..

  15 రోజులు కష్టపడ్డారు..

  దాంతో మహేశ్ చేత డబ్బింగ్ చెప్పించాలని ట్రై చేశాం. ఓ 20 నిమిషాలు డబ్బింగ్ చెప్పమని అడిగాం. తొలుత అంగీకరించలేదు. కానీ నేను కన్విన్స్ చేశాను. సాధారణంగా తెలుగు సినిమాకు మహేశ్ నాలుగు రోజులు డబ్బింగ్ కోసం వెచ్చిస్తారని విన్నాను. కానీ అవుట్ పుట్ అద్భుతంగా రావడానికి స్పైడర్ తమిళ వెర్షన్ కోసం 15 రోజులు కష్టపడ్డారు. అదీ మహేశ్ డెడికేషన్.

  మహేశ్‌ను విసిగించాను..

  మహేశ్‌ను విసిగించాను..

  తమిళంలో డైలాగ్స్ సరిగా రావడానికి మహేశ్‌తో పదే పదే డైలాగ్స్ చెప్పించాను. చాలా సార్లు ఇలా చెప్పు.. అలా చెప్పు అని విసిగించాను. సూపర్‌స్టార్ అయి కూడా ఏ ఒక్కరోజు కూడా మాపై విసుక్కోలేదు. అదీ ఆయన ప్రొఫెషనలిజం. అందుకే మహేశ్ అంటే చెప్పలేనంత గౌరవం పెరిగింది.

  తమిళంలో కూడా సూపర్‌స్టార్.

  తమిళంలో కూడా సూపర్‌స్టార్.

  ఇప్పటివరకు ఆయన తెలుగులోనే సూపర్‌స్టార్. కానీ స్పైడర్ తర్వాత కోలివుడ్‌లో కూడా సూపర్ స్టార్ అవుతారు. బాక్సాఫీస్ ఆయన రికార్డు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. తమిళంలో కూడా సినిమాలు చేయాలని మహేశ్ వెంట పడుతారు.

  నేషనల్ అవార్డు ఖాయం..

  నేషనల్ అవార్డు ఖాయం..

  స్పైడర్ విషయానికి వస్తే క్లైమాక్స్ ఓ ఛాలెంజ్‌లా మారింది. క్లైమాక్స్ దాదాపు 15 రోజులపాటు షూట్ చేశాం. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. అంతమందితో సినిమా చేసేటప్పుడు ఒక చిన్న తప్పు జరిగినా మళ్లీ షూటింగ్ చేయాల్సి వచ్చేది. పీటర్ హేన్స్ ఉండటంతో పోరాట సన్నివేశాలను తెరకెక్కించడం సులభమైంది. ఇప్పటికే పీటర్‌కు జాతీయ అవార్డు వచ్చింది. మళ్లీ ఈ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుంది అని మురుగదాస్ అన్నారు.

  English summary
  Spyder movie is slated to release on September 27th. In this occassion, Director AR Murugadoss speaks to media. He said that "I first met Mahesh after Pokiri released back in 2006. After all these years, my dream of working with Mahesh has finally come true,"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X