»   » మహేష్ బాబు "వాస్కో డా గామా" కాదు..... అది ఒక పుకారు

మహేష్ బాబు "వాస్కో డా గామా" కాదు..... అది ఒక పుకారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మురుగ దాస్ సౌత్ ఇండియా లోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరు... మహేష్ బాబు టాలీవుడ్ దిగ్గజాల్లో చేరిన ఇప్పూదు టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్న హీరో. మామూలుగానే వీరిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే ఆసక్తిగా చూసే జనం...ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే ఇంకెంత భారీ అంచనాలతో ఉంటారో చెప్పక్కరలేదు. ఇప్పుడు మహేస్-మురుగ దాస్ల తో వస్తున్న సినిమా అదే స్థాయి అంచనాలని చేరుకుంటోంది ఇంకా మొదలు కాకుండానే..ఊహాగానాలు మొదలయ్యాయి.

తెలుగు తమిళ భాషల్లో 80 కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కించే ఈ చిత్రానికి 'వాస్కో డా గామా' అనే టైటిల్ పెడుతున్నట్టు ఇటీవల టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని దర్శకుడు మురుగదాస్ పేర్కొన్నాడు. ఇంకా దీనికి టైటిల్ ఏదీ అనుకోలేదని ఆయన చెప్పాడు.

babu-muru

ఓ బ‌లమైన సామాజిక నేప‌థ్యం ఉన్న స్టోరీతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ ప‌రిణితి చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రీష్‌జైరాజ్‌, సంతోష్‌శివ‌న్ లాంటి సెలబ్రిటీ టెక్నీషియన్ లు ఈ సినిమా కోసం పని చేయనున్నారు.. జూలై 15 నుంచి ఈ చిత్రం షూటింగును రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించడానికీ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే, ఈ సినిమా తమిళ వెర్షన్ కు మహేశ్ సొంతంగా డబ్బింగ్ చెబుతాడట. తను చెన్నయ్ లోనే పుట్టిపెరగడం వల్ల మహేశ్ కి తమిళం బాగా వచ్చు!

ఇక ఈ సినిమా బడ్జెట్ విశయానికి వస్తే దాదాపు 100 కోట్లకి చేరువలో ఉన్న బడ్జెట్ ని సమకూర్చింది ఒకరూ ఇద్దరూ కాదు ఏకంగా పెద్ద పెద్ద సంస్థలే రంగం లోకి దిగాయి. ఈ సినిమాకు ప్ర‌ధాన నిర్మాత ఎన్‌వి.ప్ర‌సాద్‌. ఇక రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, లియో ప్రొడ‌క్ష‌న్‌, మెగా సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను స‌మ‌ర్పిస్తున్నాయి.

ఇక్కడితో అయిపోలేదు ఈ సినీ నిర్మాణ సంస్థలతో బాటు మురుగ‌దాస్‌తో ఉన్న ఒప్పందం ప్ర‌కారం ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, మ‌హేష్ సొంత బ్యాన‌ర్ అయిన ఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌లు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాయ‌ట‌. సో ఈ లెక్క‌న చూస్తే ఈ సినిమాలో మొత్తం ఆరు నిర్మాణ సంస్థ‌లు పాలు పంచుకున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

English summary
AR Murugadoss gives a clarification on the title of his next movie with Mahesh Babu
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu