twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా ఫ్లాప్‌కు కారణం అదే.. పెదవి విప్పిన దర్శకుడు మురుగదాస్..

    By Rajababu
    |

    దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా ఏఆర్ మురుగదాస్‌కు మంచి పేరు ఉంది. అందుకు తగినట్టుగానే గజని, టాగూర్, తుపాకీ, కత్తి లాంటి చిత్రాలు అద్దం పట్టాయి. తాజాగా ప్రిన్స్ మహేశ్ బాబుతో కలిసి స్పైడర్ రూపొందించారు. ఈ ప్రమోషనల్ భాగంగా తన గత చిత్రాల గురించి, స్పైడర్ గురించి మాట్లాడుతూనే ప్రభాస్, రజనీకాంత్‌తో సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.

    వార్తలో నిజం లేదు..

    వార్తలో నిజం లేదు..

    ప్రభాస్‌కి కథ వినిపించానని వచ్చిన వార్తల్లో నిజం లేదు. బాహుబలి సెన్సేషనల్ హిట్ తర్వాత ఫ్రెండ్లీగా ఫోన్‌లో మాట్లాడాను. వ్యక్తిగతంగా ప్రభాస్‌ను కలువలేదు. కథ చెప్పడం గానీ.. ప్రాజెక్టు గురించి చర్చించలేదు. భవిష్యత్‌లో కుదిరితే ప్రభాస్‌తో సినిమా చేసే ఆలోచన ఉంది.

    Recommended Video

    ‘స్పైడర్’పై క్రిటిక్స్ రిపోర్ట్స్ : రివ్యూలపై వివాదం : SPYder movie critic reports
    త్వరలో రజనీతో సినిమా

    త్వరలో రజనీతో సినిమా

    సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రెండు, మూడు సార్లు ఆయన్ని కలిసాను. ఆయనకు కథ కూడా చెప్పాను. కానీ డేట్స్‌ కుదరలేదు. మా కాంబినేషన్‌లో సినిమా తర్వాత వుండొచ్చు. అది ఎప్పుడన్నది కాలమే నిర్ణయిస్తుంది.

    ఠాగూర్ మధుతో పరిచయం

    ఠాగూర్ మధుతో పరిచయం

    అలాగే నిర్మాత టాగూర్‌ మధుతో నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. తమిళంలో రమణ (టాగూర్) చిత్రాన్ని చేసినపుడు ఆ సినిమాకు నిర్మాతగా మధు వ్యవహరించారు. రమణ రిలీజ్‌కి ముందే తెలుగులో చిరంజీవిగారితో రీమేక్‌ చెయ్యాలనుకున్నారు. ఆ తర్వాత హిందీ గజిని, స్టాలిన్‌ చేశాం. నాలుగు సినిమాలు కంటిన్యూగా చేశాం. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మధు, ప్రసాద్‌ కామన్‌గా అందరికీ తెలుసు.

    ప్రసాద్ అలా వర్క్ చేశారు..

    ప్రసాద్ అలా వర్క్ చేశారు..

    తమిళ చిత్ర పరిశ్రమలో ఎవరైనా తిరుపతి వెళ్ళాలంటే ప్రసాద్‌ సహకరిస్తారు. కత్తి టైమ్‌లో కూడా నాకు హెల్ప్‌ చేశారు. 'స్పైడర్‌' మేకింగ్‌లో ఇద్దరి సహకారం మర్చిపోలేను. ప్రసాద్‌ కంప్లీట్‌ అయ్యే వరకు ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌లా వర్క్‌ చేశారు.

    భయం ఉండేది..

    భయం ఉండేది..

    10 సంవత్సరాల క్రితం చేసిన స్టాలిన్‌ చిత్రం ఫెయిల్ కావడానికి కారణాలను ఈ సందర్భంగా విశ్లేషించారు. టాగూర్ సినిమా చేస్తున్న సమయంలో సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఎదుగుతున్నాను. అప్పటికే చిరంజీవి మెగాస్టార్. నేను డైరెక్టర్‌గా అప్పుడు కొత్తవాడిని. చిరంజీవిగారితో సినిమా చెయ్యడం అంటే ఒక భయం అనేది వుంది.

    తెలుగు చేయడం..

    తెలుగు చేయడం..

    అంతేకాకుండా తెలుగులో చేయడం ఫస్ట్‌టైమ్‌. నా మాతృభాష కాకుండా మరో లాంగ్వేజ్‌లో చేస్తున్నానంటే టెన్షన్‌గానే ఉండేది. అయినా చిరంజీవిగారితో సినిమా చేయడం కంఫర్ట్‌గానే ఫీల్‌ అయ్యాను. కానీ సినిమా మేకింగ్‌లో ఏదో తేడా వచ్చింది. అందుకే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు మహేష్‌తో సినిమా చేస్తున్నానంటే టెన్షన్‌ ఏమీ లేదు. ఎందుకంటే మహేష్‌ 10 సంవత్సరాలుగా నాకు పరిచయం. 'స్పైడర్‌'తో బాగా క్లోజ్‌ అయ్యాం. ప్రస్తుతం మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం.

    పర్‌ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్

    పర్‌ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్

    గతంలో మహేష్‌ చేసిన సూపర్‌హిట్‌ సినిమాలు చూశాను. స్క్రిప్ట్‌కి తగ్గట్టుగా, క్యారెక్టర్‌కి తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్‌లో హండ్రెడ్‌ పర్సెంట్‌ డిఫరెన్స్‌ కనిపిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్‌ మహేష్‌ ఇంతకుముందు చెయ్యలేదు. బాడీ లాంగ్వేజ్‌ విషయంలోగానీ, యాక్షన్‌ సీక్వెన్స్‌లలోగానీ మా ఇద్దరిదీ ఒకే టేస్ట్‌. నేచురల్‌గా వుండాలి, ఫైట్స్‌ అనగానే గాల్లోకి ఎగిరిపడేలా వుండకూడదు అనుకుంటాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు ఎఆర్‌ మురుగదాస్‌.

    డివైడ్ టాక్..

    డివైడ్ టాక్..

    భారీ బడ్జెట్‌తో రూపొందించిన స్పైడర్ చిత్రంపై సినీ వర్గాల్లో మిశ్రమ స్పందన కనిపిస్తున్నది. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్‌లో, లోకల్ మార్కెట్‌లో భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. సినిమాపై ఉన్న టాక్ పట్టించుకోకుండా భారీ వసూళ్లు రావడం మహేష్ బాబు స్టామినాకు సాక్ష్యంగా నిలిచాయి.

    English summary
    In occassion of Spyder release, Director AR Murugadoss shares his views with media. He reveals few facts doing movies with Prabhas, Rajinikanth. And also given the reason failure behind the Tagore movie with Chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X