»   » అతని స్సీడుతో పోలిస్తే మహేష్ కి పదోవంతు కూడా లేదు...

అతని స్సీడుతో పోలిస్తే మహేష్ కి పదోవంతు కూడా లేదు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చేస్తున్నది ఒక్క సినిమా. కానీ అది కూడా సకాలంలో పూర్తి చేయలేకపోతున్నాడు మహేష్ బాబు. సాధారణంగా ఒక సినిమా తీయడానికి నాలుగైదు నెలలకి మించి తీసుకోని శ్రీను వైట్ల కూడా మహేష్ తో సినిమా అనేసరికి నత్త నడక నడుస్తున్నాడు. వేరే దర్శకులతో సినిమాలు చేయడానికి తలయితే ఊపేశాడు కానీ ప్రస్తుతం చేస్తున్న సినిమా పని త్వరగా పూర్తి చేయడంలో మహేష్ విఫలమవుతున్నాడు.

మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి మహేష్ బాబు అంగీకరించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోటున్న ఈ చిత్రంలో మహేష్‌తో పాటు తమిళ నటుడు విజయ్‌, ఆర్య నటించనుండగా అనుష్క కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అప్పుడే ఈ సినిమాకి అతను అయిదు ట్యూన్లు చేసిచ్చేశాడు. అవన్నీ సింగిల్ సిట్టింగ్ లో ఓకే అయిపోయాయి. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నా కూడా రెహమాన్ ఎంత వేగంగా పని చేస్తాడనేదానికిదో ఉదాహరణ. అతని వేగంలో మహేష్ పదో వంతు చూపించినా తన నుంచి ఏడాదికి రెండు సినిమాలొస్తాయి.

రూ.100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలనే ఈ సినిమాను మణిరత్నం స్వంత సంస్థ మద్రాసు టాకీస్‌ నిర్మించనుంది. మణిరత్నం టీమ్‌ లో వుండే ఎఆర్‌. రెహమాన్‌, సంతోష్‌ శివన్‌, సాబు సైరిల్‌, శ్రీకర్‌ ప్రసాద్‌ సాంకేతిక బృందం. కాగా, ఈ చిత్రం అక్టోబర్‌ నుండి షూటింగ్‌ జరుపుకోనుంది.

English summary
Ponniyin Selvan of Maniratnam is going to have great and outstanding music than ever by A.R Rahman. Both Maniratnam & A.R Rahman together gave many outstanding songs so far by continuing the same A.R Rahman has completed five songs for this magnum opus.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu