twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రూస్లీ కోసం ఏ ఆర్ రెహమాన్: లెజెండరీ యోధుడి పై ఇండియన్ బయో పిక్

    బ్రూస్‌లీ మరణించి నలభై ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో సజీవంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే సన్నాహాలు జరుగుతున్నాయి.

    |

    హాంకాంగ్‌ లో పుట్టి.. మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారాయన. అసలు మన దేశంలో కరాటే, కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్ లాంటి పేర్లు వినిపించడం మొదలయింది అయన నుంచే. తన జీవితలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని.. ఉన్నత స్థానానికి చేరుకున్న బ్రూస్‌లీ.. మూడుపదుల వయసులోనే ఈ లోకాన్ని వీడారు.

    బ్రూస్‌లీ మరణించి నలభై ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో సజీవంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే సన్నాహాలు జరుగుతున్నాయి. 'లిటిల్‌ డ్రాగన్‌' పేరుతో ప్రముఖ భారతీయ దర్శకుడు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండటం విశేషం. శేఖర్‌ గతంలో 'ఎలిజబెత్‌', 'ఎలిజబెత్‌: ది గోల్డెన్‌ ఏజ్‌' చిత్రాలతో అంతర్జాతీయ ప్రశంసలందుకున్నారు.

     AR Rahman to compose music for Bruce Lee biopic to be directed by Shekhar Kapur

    'లిటిల్‌ డ్రాగన్‌'కు బ్రూస్‌లీ కుమార్తె షనొన్‌ లీ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు సహ రచయితగా పనిచేస్తున్నారు. ''బ్రూస్‌లీ బాల్యం, యవ్వన దశల్లో ఆయనకు ఎదురైన స్నేహం, ప్రేమ, మోసం, జాతి వివక్ష, తనను తాను నిరూపించుకోవడానికి ఉక్కు సంకల్పంతో ఎదుర్కొన్న కష్టాల నేపథ్యంలో 'లిటిల్‌ డ్రాగన్‌'ను రూపొందించబోతున్నామ''ని షనొన్‌ లీ తెలిపారు. ''బ్రూస్‌లీలో తిరుగులేని మార్షల్‌ ఆర్ట్స్‌ యోధుడే కాదు... గొప్ప తత్వవేత్త కూడా ఉన్నారు. ఆయనలోని ఈ కోణాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఆవిష్కరించబోతున్నామ''ని తెలిపారు శేఖర్‌.

    మన ఇండియన్ డైరక్టర్ అయిన శేఖర్ కపూర్.. ఇప్పుడు 'లిటిల్ డ్రాగన్' పేరుతో బయోపిక్ తీస్తున్నాడు. ఇది నిజంగానే పెద్ద విషయమే. బ్రూస్ లీ అసలు హాంగ్ కాంగ్ నుండి అమెరికా వెళ్లడం.. మద్యలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం.. స్టంట్ మ్యాన్ గా వచ్చిన హీరో అవ్వడం.. దర్శకుడు అయ్యి మైండ్ బ్లోయింగ్ సినిమాలు తీయడం. ప్రొడ్యూస్ చేయడం.

    చారిటీలో పాల్గొనడం. పెళ్ళి.. పిల్లలు.. అనుకోకుండా చనిపోవడం.. వంటి ప్రతీ అంశాన్ని శేఖర్ కపూర్ తెరకెక్కించనున్నరట. అయితే ఈ సినిమాకు స్వరాలు ఎవరు సమకూరుస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైములో.. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ ముందుకొచ్చాడు. ఆల్రెడీ రెండుసార్లు ఆస్కార్ గెలుచుకున్న రెహ్మాన్.. ఇప్పుడు మరోసారి హాలీవుడ్ కు తన సత్తా చాటే పనిలో బిజీగా ఉన్నాడు. మొత్తానికి వెండితెరపై మరోసారి మనం బ్రూస్ లీ జీవితపు పంచులను చూస్తాం. అయితే ఈసారి రెహ్మాన్ స్వరాల సాక్షిగా వాటిని ఆలకిస్తూ తిలకిస్తాం.

    English summary
    Oscar-winning composer A.R. Rahman has been roped in to compose the music for the Bruce Lee biopic, which is being directed by Academy Award nominated filmmaker Shekhar Kapur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X