»   » బాలుతో గొంతు కలిపిన ఎఆర్ రెహమాన్ తనయ..

బాలుతో గొంతు కలిపిన ఎఆర్ రెహమాన్ తనయ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన ట్యూన్స్ తో పాటు పాడే వారి వాయిస్ లు కుడా కొత్తగా వుండాలని తన చిత్రాలతో సరికొత్త ప్రయోగాలు చేస్తుంటాడు ఎ.ఆర్.రెహమాన్. ఇప్పటి వరకు తన చిత్రాల ద్వారా ఎందరినో ప్రతిభావంతులైన గాయనీ, గాయకులను పరిచయం చేసిన ఎఆర్ రెహమాన్ ప్రేమికుడు" చిత్రంలోని 'చికుబుకు చికుబుకు రైలే.." పాట ద్వార తన మేనల్లుడిని, హాలీవుడ్ సినిమా 'కపుల్ ట్రీట్" తో తన తనయుడు అమీన్ ను గాయకులుగా పరిచయం చేశాడు. ఇక ఇప్పుడు తన కూతురు ఖతీజాను కూడా గాయకురాలిగా పరిచయం చేస్తున్నాడు రెహ్మాన్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'పులి" సినిమాకి సంగీతాన్ని అందించిన రెహమాన్ కు అభిమానుల నుండి మంచి స్పందన లభిస్తోంది. అలాగో రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'రోబో" చిత్రానికి రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో వచ్చే ఓ ఇంట్రడక్షన్ సాంగ్ ని రెహమాన్ కుమార్తె 'ఖతీజా"చే రెహమాన్ పాడించారట. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం లాంటి సీనియర్ గాయకుడితో ఖతీజా తన తొలిపాట పాడడం అదష్టమనే చెప్పాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu