»   » వైజాగ్ లోనూ 'రెహమాన్‌ ఇష్క్‌' పోగ్రామ్, డిటేల్స్

వైజాగ్ లోనూ 'రెహమాన్‌ ఇష్క్‌' పోగ్రామ్, డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రజల్లో శాంతి, ప్రేమ భావనల్ని పెంపొందించే ఆలోచనతో ఆయన 'రెహమాన్‌ ఇష్క్‌' పేరుతో ఓ సంగీత యాత్రను ఎ.ఆర్‌.రెహమాన్‌... చేపడుతున్నారు. అక్టోబరు1న కోల్‌కతాలో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. ఆ తర్వాత విశాఖపట్నం (అక్టోబరు12), జైపూర్‌ (అక్టోబరు20), అహ్మదాబాద్‌ (అక్టోబరు 27) ప్రాంతాల్లో జరుగుతుంది.


'రెహమాన్‌ ఇష్క్‌' గురించి రెహమాన్‌ మాట్లాడుతూ.. '' సంగీత ప్రపంచంలో నేనీ స్థాయికి చేరానంటే అది అభిమానులు, ప్రేక్షకుల వల్లే. వారి ఆదరణే నన్నీ స్థాయికి చేర్చింది. అందుకే వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. దీనితోపాటు శాంతి, ప్రేమ భావనల్ని చాటాలన్నది ఓ ఆలోచన. దేశంలో అన్ని ప్రాంతాలకు వెళ్లాలనే తలంపుతో ఈ సంగీత యాత్రకు కోల్‌కత, విశాఖపట్నం, జైపూర్‌, అహ్మదాబాద్‌ ప్రాంతాల్ని ఎంచుకున్నానని'' చెప్పారు.

AR Rahman finally announces India tour, Rahmanishq


సంగీత మేళవింపులో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న రెహమాన్‌ ఈ యాత్రను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఆయన భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. 'రోజా', 'జోథా అక్బర్‌', 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌', 'జబ్‌తక్‌హైజాన్‌', 'రాన్‌జానా' తదితర చిత్రాల్లో అయన స్వరపరచిన పాటలకు ఈ యాత్రలో చోటుకల్పించారు. సాధారణ సంగీత కచేరీలకు భిన్నంగా నూతన విధానాన్ని అవలంబిస్తున్నారు. సాంకేతికంగా కూడా ఈ సంగీత యాత్ర ఆశ్చర్యపరిచేదిగా ఉంటుంది.

ఇందులో రెహమాన్‌తోపాటు విజయ్‌ ప్రకాశ్‌, శ్వేత పండిట్‌, సుఖ్విందర్‌ సింగ్‌, నీతి మోహన్‌ కూడా పాల్గొంటారు. ప్రేక్షకుల భాగస్వామ్యం ఈ కార్యక్రమం ప్రత్యేకత. 'రెహమాన్‌ అంటే నీకెంత ఇష్టం?' అంటూ ఓ పోటీ ద్వారా ప్రేక్షకుల్ని ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీఐపీ పాసులు ఇస్తున్నారు. రెహమాన్‌ గతంలోనూ 2010లో 'ద జర్నీ హోమ్‌ వరల్డ్‌ టూర్‌' అని ఓ యాత్రలో చేపట్టారు. దీనిలో భాగంగా 16 దేశాల్లో పర్యటించారు. 'రెహమాన్‌ ఇష్క్‌' యాత్ర భారీగా విజయవంతమవుతుందని చెప్తున్నారు.


మరోవైపు సంగీతదర్శకుడిగా అటు భారతీయ చిత్రాలతో ఇటు విదేశీ చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. ఇంత బిజీలో కూడా మరో బాధ్యతను తలకెత్తుకున్నారు రెహమాన్. అదే నిర్మాణ బాధ్యత. అవును. త్వరలో ఆయన నిర్మాతగా మారనున్నారు. 'వైఎమ్ మూవీస్' పేరుతో ఓ బేనర్ కూడా స్థాపించారు రెహమాన్. తొలి ప్రయత్నంగా ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఓ హిందీ సినిమా నిర్మించబోతున్నారు. కొంతమంది రచయితలతో కలిసి ఈ చిత్రానికి రెహమాన్ కథ తయారు చేశారు. ఇంకా దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులను, నటీనటులను ఎంపిక చేయలేదు. ఈ చిత్రానికి సంగీతం కూడా రెహమానే అందిస్తారు.

English summary
After making the nation proud on several global musical platforms, maestro Rahman is set for an India tour, titled “Rahmanishq.” The tour will begin in Kolkata Oct. 1, followed by Visakhapatnam (Oct. 12), Jaipur (Oct. 20) and Ahmedabad (Oct. 27). “It is always fun and exciting to perform for fans. It will be an experience of music, joy and fun. I think everything has a right time. Three years back I didn't even know my future,” Rahman told
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu