twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గౌరవం: ఇది నా ఏరియా అంటున్న ఏఆర్ రెహమాన్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు విదేశీ గడ్డపై మరో అరుదైన గౌరవం దక్కింది. కెనడా దేశంలోని గ్రేటర్ టోరంటో పరిధిలోని ఆన్‌టారియో ప్రాంతంలో ఓ వీధికి రెహమాన్ పేరు పెట్టారు. ఈ విషయాన్ని రెహమాన్ తన సోషల్ నెట్వర్కింగు ద్వారా వెల్లడించారు.

    వెల్ కం టూ మై స్ట్రీట్ అంటూ....రెమహన్ అందుకు సంబంధించిన ఫోటోను పోస్టు చేసారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఏఆర్ రెహమాన్ స్ట్రీట్ ఫోటోను చూడొచ్చు. విదేశీ గడ్డపై మన అభిమాన మ్యూజిక్ డైరెక్టర్‌కు ఇలాంటి గౌరవం దక్కడం ఎంతో గొప్ప విషయమని చెప్పక తప్పదు.

     A R Rahman

    ఇతర వివరాల్లోకి వెళితే....బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రెహమాన్ త్వరలో ఓ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో సంయుక్తంగా ఆయన సినిమాను నిర్మించబోతున్నారట. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని అంటున్నారు.

    గతంలోనూ రెహమాన్ విషయంలో అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఆయన దర్శకుడిగా అడుగు పెట్టబోతున్నారంటూ ఆ మధ్య సినీ వర్గాల్లో చర్చ సాగింది. అయితే ఆ విషయం ఇప్పటికీ నిజం కాలేదు. తాజాగా రెహమాన్ నిర్మాతగా మారుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. మరి ఇందులో నిజమెంతో చూడాలి.

    ఈ విషయాలను పక్కన పెడితే....సంగీత ప్రపంచంలో తదనైన ముద్ర వేస్తూ ముందుక సాగుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్‌కు తగిన విధంగా మ్యూజిక్ విభాగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇనిస్టిట్యూట్స్ ప్రారంభించారు. ఇటీవల ముంబైలో ముఖేష్ అంబానీ చేతుల మీదుగా రెహమాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ ప్రారంభమైంది.

    English summary
    Oscar-winning music composer A R Rahman gets a street named after him in Markham, Ontario, Canada and the board having the street's name reads 'Allah-Rakha Rahman st'. A delighted Rahman posted a picture of him holding the board and tweeted "Welcome to my street! (In Markham, ON, Canada)."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X