»   » మరోసారి ఆస్కార్‌ బరిలో రెహమాన్... మూడో ఆస్కార్ ఖాయమనే అంటున్నారు

మరోసారి ఆస్కార్‌ బరిలో రెహమాన్... మూడో ఆస్కార్ ఖాయమనే అంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'స్లమ్‌ డాగ్‌ మిలీనియర్‌'తో జంట ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్ మరోసారి ఆస్కార్‌ బరిలో నిలిచారు.ఈసారి 145 మంది ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో పోటీపడుతున్నారు. వారిలో రెహమాన్ కూడా ఉన్నాడు. అలాగే 91 పాటలు ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉన్నాయి. వీటిలో రెహమాన్ కంపోజ్ చేసిన 'జింగా' కూడా ఉండటం గమనార్హం.

ఈ మేరకు అకాడెమీ ఆఫ్‌ మోషన పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. 'రోగ్‌ ఒన్ : ఎ స్టార్‌ వార్స్‌ స్టోరీ', 'లా లా లాండ్‌', 'మోనా', 'ఫ్లోరెన్స ఫోస్టర్‌ జెన్కిన్స' వంటి పలు చిత్రాల సంగీతంతో రెహమాన పోటీ పడుతుండటం గమనార్హం. ఈ నామినేషన్లకు సంబంధించిన తుది వివరాల జాబితాను జనవరి 24న ప్రకటిస్తారు. ఫిబ్రవరి 26న హాలీవుడ్‌ అండ్‌ హైలాండ్‌ సెంటర్‌లోని డాల్బీ థియేటర్లో అవార్డు ఫంక్షన్ జరగనుంది.

AR Rahman in Oscar race again, Pele brings him recognition

 బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం 'పీలే' బయోపిక్‌ 'పీలే: బర్త్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌' చిత్రం ద్వారా ఈసారి ఆస్కార్ పోటీలో రెహ్మాన్ చోటు సంపాదించారు. జెఫ్‌ జింబాలిస్ట్‌, మైకెల్‌ జింబాలిస్ట్‌ ఈ చిత్రానికి దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.ఈసారి 89వ ఆకాడమీ అవార్డులకు ఒరిజనల్ స్కోర్ విభాగంలో 145 మంది పోటీ పడుతున్నారు. పీలేలోని రెహమాన్‌ కంపోజ్‌ చేసిన 'గింగా' పోటీలో నిలిచింది.

దీనికి సంబంధించి నామినేషన్ల తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేస్తారు. 2011లోనూ రెహమాన్‌కి రెండు ఆస్కార్‌ నామినేషన్లు లభించాయి. బోయ్లే '127 అవర్స్‌' సినిమా ఒరిజినల్‌ స్కోర్‌కి, 'ఇఫ్‌ ఐ రైజ్' అనే పాటకి ఆయన నామినేట్‌ అయ్యారు. 2014లో రెహమాన్‌ హాలీవుడ్ చిత్రాలు 'మిలియన్‌ డాలర్‌ ఆమ్'‌, ద హండ్రెడ్‌ ఫుట్‌ జర్నీ, భారతీయ సినిమా 'కొచ్చాడయాన్‌'కు కూడా రెహ్మాన్ పోటీ చేసి ఆస్కార్‌ బరిలో పోటీ పడ్డారు. అయితే అస్కార్‌ను తీసుకురాలేకపోయారు. 2017 ఫిబ్రవరి 26న 89వ అకాడమీ అవార్డుల ప్రదానం ఉంటుంది.

English summary
AR Rahman's name features in a long list of 145 scores in contention for a nomination in the Original Score category for the 89th Academy Awards. He contributed a song in Pele
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu