twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందూ జ్యోతిష్కుడి వల్లే: మతమార్పిడిపై రెహమాన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హిందూ మతంలో దిలీప్ కుమార్‌గా పుట్టి సూఫీ మతంలోకి మారి తన పేరును అల్లా రఖా రెహమాన్‌గా మార్చుకున్నాడు మన సంగీత దిగ్గజం ఏఆర్.రెహమాన్. ప్రస్తుతం దేశంలో మత మార్పిడుల విషయంపై ఆసక్తికర చర్చ సాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ పత్రిక ‘ది డాన్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పుకొచ్చాడు రెహమాన్.

    ఓ హిందూ జ్యోతిష్కుడి సూచన మేరకు తాను పేరు మార్చుకున్నానని రెహమాన్ చెప్పుకొచ్చారు. రెహమాన్ ముందు ‘అల్లా రఖా' అని చేర్చుకోమని అతను సూచించినట్లు తెలిపారు. చిన్న తనంలో తండ్రి చనిపోయి చేతిలో డబ్బులు లేక కష్టాలు అనుభవిస్తున్న సమయంలో సూఫీ మతగురువు పీర్ కరిముల్లా షా ఖాద్రి బోధనలతో ఉపశమనం పొందానని రెహమాన్ తెలిపారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    AR Rahman reveals why he chose to adopt new faith

    రెహమాన్ గురించి మరింత...
    రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు. అసలే పేద కుటుంబం. తండి శేఖర్‌ మరణంతో వారి కుటుంబం కష్టాల పాలైంది. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది.

    సినిమాల వివరాలు...
    జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ఆయన సంగీతం అందించిన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా' సినిమా మొదట విడుదలైంది.

    ‘రోజా' సినిమా భారీ విజయం సాధించడం, ముఖ్యంగా మ్యూజికల్ హిట్ కూడా కావడంతో రెహహాన్ పాపులర్ అండ్ బిజీ సంగీత దర్శకుడయ్యాడు. "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "ఆస్కార్"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్.

    English summary
    AR Rahman, who was born as AS Dileep Kumar, recently shared the tale of why he chose to discard the faith he was born into and adopt a new one. The 48-year-old's father untimely death had put several financial pressures on the family, so his spiritual-minded mother had met, and gained immense succor, from a Sufi saint, peer Karimullah Shah Qadri, the Dawn reported.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X