»   » తెలుగు సినిమాలో ఏఆర్ రెహమాన్ తనయుడి పాట!

తెలుగు సినిమాలో ఏఆర్ రెహమాన్ తనయుడి పాట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనయుడు ఏఆర్ అమీన్ తెలుగు సినిమా కోసం పాట పాడారు. తెలుగులో తెరకెక్కుతున్న ‘నిర్మలా కాన్వెంట్' చిత్రం కోసం అతడు ఈ పాట పాడారు. అమీన్ పాడిన పాట చాలా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. ‘నిర్మలా కాన్వెంట్' చిత్రం ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది తన తండ్రి సంగీతం అందించిన ‘ఓకే బంగారం' సినిమాలో కూడా ఏఆర్ అమీర్ పాట పాడారు.

‘నిర్మలా కాన్వెంట్' సినిమా వివరాల్లోకి వెళితే...
కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘నిర్మలా కాన్వెంట్‌'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

AR Rahman's son AR Ameen croons a song for 'Nirmala Convent'

మొదటి షెడ్యూల్‌ జైపూర్‌లో, రెండో షెడ్యూల్‌ అరకులో, మూడో షెడ్యూల్‌ మెదక్‌లో, నాలుగో షెడ్యూల్‌ నైనిటాల్‌లో, ఐదో షెడ్యూల్‌ చిక్‌మంగుళూరులో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేశారు. దీంతో నాగార్జున షెడ్యూల్‌ తప్ప దాదాపు షూటింగ్‌ పూర్తి కావచ్చింది. ఫిబ్రవరిలో నాగార్జున షెడ్యూల్‌ ‘సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో సంక్రాంతి సూపర్‌హిట్‌ కొట్టిన కింగ్‌ నాగార్జున ‘నిర్మల కాన్వెంట్‌' చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. దాదాపు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రంలోని నాగార్జున పోర్షన్‌ షూట్‌ చెయ్యాల్సి వుంది.ఈనెలలో నాగార్జునకు సంబంధించిన షెడ్యూల్‌ను చేస్తారు.

AR Rahman's son AR Ameen croons a song for 'Nirmala Convent'

కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

English summary
A.R Rahman's son A.R Ameen has made his Telugu singing debut in upcoming film "Nirmala Convent".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu