»   » మా అబ్బాయి పాడిన పాట మణిరత్నం కు నచ్చింది (వీడియో)

మా అబ్బాయి పాడిన పాట మణిరత్నం కు నచ్చింది (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''నా కుటుంబం కోసం ఓ పాట చేశాను. అది విన్న మణిరత్నంగారు 'ఈ పాట నాకు కావాలి' అన్నారు. అలా మా అబ్బాయి తొలి పాట ఈ చిత్రంలో పాడినట్త్టెంది. దానికి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రోజూ నా సెల్‌ఫోన్‌కి సందేశాలొస్తున్నాయి. ఆ విషయం ఎంతో ఆనందాన్నిస్తోంది. మామూలుగా మా అబ్బాయితో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేయించాలనే ఆలోచన ఉండేది. అలా తనని పరిచయం చేద్దామనుకొన్నా. 'ఓకే కణ్మణి'తో పరిచయం కావడం ఆనందంగా ఉంది'' అంటూ ఆనందంగా చెప్పుకొచ్చారు ఏఆర్‌ రెహమాన్‌. ఆ పాటను మీరు ఇక్కడ వినొచ్చు..చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే ...''మణిరత్నంగారితో కలిసి పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎవ్వరిలోనూ కనిపించని కొన్ని అరుదైన లక్షణాలు ఆయనలో కనిపిస్తుంటాయి. మామూలుగా ప్రతి ఒక్కరూ ఎదుటివాళ్ల పాపులారిటీనిబట్టి వాళ్లతో కలిసి పనిచేయాలని చూస్తుంటారు. అయితే మణిరత్నంగారు మాత్రం ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించరు. ఇతనికి విజయాలున్నాయా లేవా? అనేది కూడా చూడరు. ఆయనతో కలిసి చేస్తున్న సుదీర్ఘమైన ప్రయాణం ఎంతో సంతృప్తినిస్తోంది '' అన్నారు ఏఆర్‌ రెహమాన్‌.

ఇప్పటికే విడుదలైన చిత్రం ఆడియో సూపర్ హిట్టైంది. గతంలో ఏ. ఆర్. రెహమాన్, మణిరత్నంల కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ఆల్బంలలానే ఓకే బంగారం ఆడియో ఉండటంతో అభిమానులకు పండగ చేసుకున్నట్లైంది. మొత్తం తొమ్మిది పాటలున్న ఈ ఆల్బం మణిరత్నం మార్క్‌తో సాగింది. తమిళంలో వైరముత్తు ఈ పాటలకు సాహిత్యాన్ని అందించగా, తెలుగులో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ బాధ్యతను నిర్వహించారు. పిసి శ్రీరామ్ కెమెరా వర్క్,ఎఆర్ రహమాన్ సంగీతం హాంట్ చేస్తోంది.

మరో ప్రక్క ఏప్రియల్ 17న విడుదలకు సిద్దమవుతున్న నేపధ్యంలో ఈ చిత్రంపై కేసు పడింది. వివరాల్లోకి వెళితే...ప్రముఖ తమిళ పంపిణీదారుడు మన్నన్...మణిరత్నంపై ఈ చిత్రం విడుదల ఆపాలంటూ కంప్లైంట్ చేసారు. ఆయన గత చిత్రం కడలి కు చెందిన అప్పులు తీర్చకుండా ఈ చిత్రం ఎలా విడుదల చేస్తారని అడుగుతూ...అలాంటి అవకాసం ఇవ్వద్దని నిర్మాతల మండలిని లిఖిత పూర్వకంగా కోరారు. తమకు కడలి వల్ల వచ్చిన లాస్ ని తీర్చిన తర్వాత మాత్రమే... ఓకే కన్మణి విడుదలకు ఒప్పుకోవాలని, అప్పటిదాకా ఆపాలని కోరారు. ఈ విషయమై ఇంకా అక్కడ నిర్మాతల మండిలి ఏమీ స్పందించలేదు.

అవాహే సినిమా టైటిల్‌ను మార్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అది వాస్తవం కాదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. శీర్షికలో ఆంగ్ల పదం ఉండటంతో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఉండదని, అందుకే మార్చాలనుకున్నట్లు చెప్పాయి. కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని పేర్కొన్నాయి.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కేరళ, తమిళనాడు సరిహద్దులో జరుగుతోంది. ఇటీవల కీలక సన్నివేశాలను చెన్నైలో తెరకెక్కించారు. ప్రకాశ్‌రాజ్‌, కనికా తదితరులు నటిస్తున్నారు. నిశ్శబ్దంగా సినిమాను ఆరంభించిన మణిరత్నం.. చాలా వేగంగా చిత్రీకరించేశారు.

AR Rahman's son sings for 'OK Kanmani'

ఇక తెలుగు వెర్షన్ విషయానికి విషయానికి వస్తే...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ తెలుగు ఈ సినిమాను విడుదల చేస్తుంది. తెలుగులో ‘ఒకే బంగారం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వేసవి ప్రారంభంలో ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదొక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ‘ఒకే బంగారం'తో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి'ను నిర్మించారు.

మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.

మౌనరాగం, ఇదయత్తైతిరుడాదే (తెలుగులో గీతాంజలి), రోజా, అలప్పాయిదే వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయి. తాజాగా అలాంటి అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ విని బల్క్ కాల్‌షీట్స్‌ను దుల్కర్ సల్మాన్ కేటాయించగా నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు.

చిత్ర కథను దర్శకుడు చెప్పగానే స్ఫెల్‌బౌండ్ అయిపోయానని నిత్యామీనన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో సెలైంట్‌గా జరుపుకుంటోం ది.


హీరోయిన్‌గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్యామీనన్ సీన్ లోకి వచ్చింది. నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన ‘ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరిద్దరూ బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా వనితా ఫిల్మ్ అవార్డుకూడా అందుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్' త్వరలో విడుదల కాబోతోంది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ... ‘‘మణిరత్నంలాంటి విజన్‌ ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరీర్‌ని ఎప్పుడూ ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. అయినా చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది'' అని అంటోంది నిత్యామీనన్‌. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటిస్తోందీ భామ.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.

English summary
Ameen, son of music legend AR Rahman, has sung a song in Mani Ratnam's 'OK Kanmani'.While AR Rahman has composed music for the film, Ameen sang the song 'Maula Wa Sallim'. The music of 'OK Kanmani' has been receiving a lot of praise and we wish this song will bring Ameen a lot of success and appreciation!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu