»   » ఇది మా అమ్మ ఇచ్చిన బహుమతి: పాతదే కానీ రెహమాన్ కి అదే అపురూపం అట

ఇది మా అమ్మ ఇచ్చిన బహుమతి: పాతదే కానీ రెహమాన్ కి అదే అపురూపం అట

Posted By:
Subscribe to Filmibeat Telugu

జీవితంలో కొన్ని బ‌హుమ‌తుల‌ను తీపి జ్ఞాపకాలుగా దాచిపెట్టుకుంటాం. కొందరు ఇచ్చిన వ‌స్తువుల‌న‌యితే జీవితాంతం భద్రంగా కాపాడుకుంటాం.ఆత్మీయులు ఇచ్చే బహుమానాలు ఎంతో ప్రత్యేకంగా దాచుకుంటాం! సంవత్సరాలు గడుస్తున్నా వాటిని భద్రంగా దాచుకుంటాం. వాటి మీద ధూళీ కూడా పడనివ్వయం. ఇక తొలిసారిగా అందుకున్న బహుమానాలు అయితే మరీ జాగ్రత్తగా చూసుకుంటాం.

Ar Rahman Shared Mother First Gift

అయితే ఎవరు ఎన్నిరకాల బహుమతులు ఇచ్చినా కూడా కన్నతల్లి ఇచ్చే బహుమానం ఎవరికైనా మరింత ప్రత్యేకం కదా! తన తల్లి ఇచ్చిన తొలి బహుమతికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్. ప్ర‌సిద్ధ సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్‌ ఏ.ఆర్‌. రెహమాన్‌ కూడా తన తల్లి కరీమా బేగం ఇచ్చిన బ‌హుమ‌తిని ఎంతో అపురూపంగా దాచిపెట్టుకున్నార‌ట‌.

Ar Rahman Shared Mother First Gift

త‌న త‌ల్లిపై ఎన‌లేని ప్రేమ‌ను క‌న‌బ‌రిచే ఏ.ఆర్‌.రెహమాన్‌కు ఆయ‌న త‌ల్లి కరీమా బేగం 1986 ఓ అంబాసిడర్‌ కారును బహుమతిగా ఇచ్చార‌ట. ఈ విషయాన్ని ఆయన తాజాగా సోష‌ల్‌మీడియా సైట్ ఫేస్‌బుక్ ద్వారా త‌న అభిమానుల‌కు తెలిపారు. ఆ కారుని త‌న‌ ఇంటి వ‌ద్ద పెరట్లో భద్రంగా దాచుకున్నట్లు పేర్కొన్నారు. ఆ కారు ఫోటోను కూడా రెహ్మాన్ పోస్ట్ చేశారు. ఫేస్ బుక్ లో మాత్రం వెంటనే ఆయన అభిమానులు స్పందించారు.

Ar Rahman Shared Mother First Gift

పోస్ట్ చేసిన ఆ ఫొటోకు లైక్స్ వర్షం కురుస్తోంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే 51 వేలకు పైగా లైక్స్ తో పాటు వందల మంది కామెంట్లు, షేర్ చేయడంతో వైరల్ గా మారింది. కొందరైతే అమ్మ ఇచ్చిన బహుమతిని ఇలాగేనా చూసుకునేది, కారును బాగు చేయించండి సార్ అంటూ కామెంట్ చేశారు. అమ్మ అప్యాయతతో ఏది ఇచ్చినా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుగా మీపై ఉంది అంటూ రెహమాన్ కు సూచిస్తున్నారు.

English summary
No matter how big a Celeb or Star he or she might be, First Present they receive from Parents will always be very special. Even for AR Rahman, The Ambassador car gifted to him by his Mother Kareema in 1986 is so close to his heart even Today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu