»   »  పూరి తమ్ముడు ఆ రోడ్ లో అమ్మాయితో...(వీడియో)

పూరి తమ్ముడు ఆ రోడ్ లో అమ్మాయితో...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అరుకు రోడ్ లో'. మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 2 న మన ముందుకు రానుంది. ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసారు.

రామ్ శంకర్ మాట్లాడుతూ - ''వాసుదేవ్ నాకు మంచి మిత్రుడు. మంచి సినిమా తీసే సత్తా గల దర్శకుడితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదొక యాక్షన్, థ్రిల్లర్ మూవీ. నిర్మాతలకు ఇది మొదటి సినిమా. మంచి విజయాన్ని సాధించి అందరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ - ''యాక్షన్, థ్రిల్లింగ్ జోన‌ర్ సినిమా ఇది. మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. నన్ను నమ్మి సపోర్ట్ చేస్తోన్న నిర్మాతలకు ధన్యవాదాలు'' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్, కెమెరామెన్: జగదీశ్ చీకటి, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: కృష్ణ మాయ, స్టంట్స్: జాషువా, నిర్మాతలు: మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి, రచన,దర్శకత్వం: వాసుదేవ్.

Read more about: araku road lo
English summary
Sairam Sankar and Nikisha Patel are paired in Araku Road Lo which is produced in Seshadri Creations banner. Meka Balasubrahmanyam, B Bhaskar, Vegiraju Prasada Raju and Rameswari Nakka are the producers; and Vasudev is the director. The film will be released on December 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu