»   » బాబాయ్ మూవీ టీజర్ రిలీజ్ చేసిన అబ్బాయ్ (ఫోటోస్)

బాబాయ్ మూవీ టీజర్ రిలీజ్ చేసిన అబ్బాయ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

​​సాయి రామ్ శంకర్, నికేష పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అరకు రోడ్ లో'. ఈ సినిమా టీజర్ ను ఆదివారం హైదరాబాద్ లో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ''సినిమా టీజర్, పోస్టర్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. ''వాసుదేవ్ నేను మంచి ఫ్రెండ్స్. మంచి సినిమా తీసే సత్తా గల దర్శకుడితో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇదొక యాక్షన్,థ్రిల్లర్ మూవీ. ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ ప్రారంభించాం. మరో ఇరవై రోజుల్లో చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాతలకు ఇది మొదటి సినిమా. మంచి విజయాన్ని సాధించి అందరికి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ.. ''ఇదొక యాక్షన్, థ్రిల్లింగ్ సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫిబ్రవరి 12న సినిమా రెండో షెడ్యూల్ మొదలుపెట్టాం. షూటింగ్ పూర్తి చేసి మే చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నన్ను నమ్మి సపోర్ట్ చేస్తోన్న నిర్మాతలకు ధన్యవాదాలు'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. ''వాసుదేవ్ తో మూడు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాం. డిశంబర్ 20న సినిమా చిత్రీకరణ మొదలుపెట్టాం. వైజాగ్, పాడేరు ప్రాంతాల్లో షూట్ చేశాం. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుంది. సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది'' అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నికేష పటేల్, కోవై సరళ, జగదీశ్ చీకటి తదితరులు పాల్గొన్నారు.

ఆకాష్ పూరి

ఆకాష్ పూరి


ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ''సినిమా టీజర్, పోస్టర్స్ కొత్తగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.

సాయిరాం శంకర్, నికేషా

సాయిరాం శంకర్, నికేషా


టీజర్ రిలీజ్ కార్యక్రమంలో సాయిరాం శంకర్, నికేషా.

వర్కింగ్

వర్కింగ్


అరకు రోడ్ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్, కెమెరామెన్: జగదీశ్ చీకటి, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: కృష్ణ మాయ, స్టంట్స్: జాషువా, నిర్మాతలు: మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ కందుకూరి, నక్కా రామేశ్వరి, రచన,దర్శకత్వం: వాసుదేవ్.

English summary
Araku Road Lo Movie Teaser Launch held at Hyderabad. Sairam Shankar, Nikesha Patel, Kovai Sarala, Waasudey, Bhala Subramanyam Meka, Suresh Varma Indukuri, Akash Puri graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu