»   » శ్రీను వైట్ల, బోయపాటి, గుత్తా జ్వాల అరవింద్-2(ఫోటోలు)

శ్రీను వైట్ల, బోయపాటి, గుత్తా జ్వాల అరవింద్-2(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శేఖర్ సూరి దర్శకత్వంలో రూపొందుతోన్న 'అరవింద్-2' చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు దర్శకులు శ్రీను వైట్ల, బోయపాటితో పాటు నటుడు శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఆడియో సీడీని శ్రీను వైట్ల ఆవిష్కరించి...బోయపాటి, శ్రీహరిలకు తొలికాపీని అందించారు. మరో వైపు దర్శకరత్న దాసరి నారాయణ వీడియో మెసేజ్ ద్వారా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ సినిమా ట్రైలర్ కొత్తగా ఉందని, మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

బోయపాటి మాట్లాడుతూ...పాటలు బాగున్నాయి, శేఖర్ సూరి సినిమాల్లో ప్రత్యేకత ఉంటుంది. అందువల్లే ఆయన గత సినిమాలు విజయం సాధించాయి. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్నారు. శ్రీహరి మాట్లాడుతూ భయమంటే తెలియని నాకు స్క్రిప్టు చెప్పి భయపెట్టాడు శేఖర్ సూరి. ఈ సినిమ థ్రిల్లింగా ఉంటుంది అన్నారు.

ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీను వైట్ల, బోయపాటి, శ్రీహరి, గుత్తా జ్వాల తదితరులు

చిత్ర యూనిట్ తో శ్రీను వైట్ల, బోపాటి, శ్రీహరి

ఆడియో ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల.

ఆడియో వేడుకలో హీరోయిన్లు శ్రీలేఖ, మాధవీలత

హీరోయిన్ అడొనికా...

సినిమా విశేష్లాల్లోకి వెళితే...
గతంలో "ఏ ఫిలిం బై అరవింద్" చిత్రాన్ని తెరకెక్కించిన శేఖర్ సూరి తాజాగా "అరవింద్ 2″ అనే మరో థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. "ఈ రోజుల్లో " ఫేం శ్రీ , అడోనికా రోడ్రిక్స్, రిషి, కమల్ కామరాజు మరియు శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జి ఫణింద్ర ఈ చిత్రాన్ని విజభేరి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ చిత్ర చిత్రీకరణ ఇప్పటికే పూర్తయ్యింది. త్వరలో సినిమా విడుదల తేదీ ఖరారు కానుంది.

English summary
Director Shekar Suri's new film Aravind-2 audio lanched at Hyderabad. Srinu Vaitla, Boyapati Srinu, Srihari, Aravind-2 movie unit attend the event.
Please Wait while comments are loading...