twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు నేర్చుకోను: అరవింద్ స్వామి, ఇకనైనా మనకు మనోళ్ళకి అర్థమవుతుందా??

    స్టైలిష్ విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి మాత్రం తెలుగు నేర్చుకోవడం ఇష్టం లేదట

    |

    ప్రస్తుతం తెలుగులో స్టయిలిష్ విలన్ వేషాలేయాలంటే చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తున్నారు. టాప్ ప్లేస్ లో జగపతిబాబు మాత్రమే ఉన్నాడు. ప్రకాష్ రాజ్ తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు అప్పుడప్పుుడు మెరుస్తున్నారు. ఇప్పుడు వీళ్లందరికీ ప్రత్యామ్నాయం దొరికాడు. ధృవ సినిమాతో తెలుగుతెరకు అరవింద్ స్వామి లాంటి ఓ హ్యాండ్సమ్ విలన్ లభించాడు, థని ఒరువన్ సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి...

    ఆ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ధృవలో కూడా విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. మూవీలో చెర్రీ చేసిన పాత్రకు ఎంత రెస్పాన్స్ వస్తుందో... అదే స్థాయిలో అరవింద్ స్వామి పోషించిన రోల్ కు కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతి ఒక్కరు అరవింద్ స్వామి పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించుకోవడం కనిపించింది. అప్పుడు రోజాలో నటించిన హీరోయేనా ఈ విలన్ అంటూ మరికొందరు ఆశ్చర్యం కూడా వ్యక్తంచేస్తున్నారు.

    తెలుగు ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ ఫీడ్ బ్యాక్ కు అరవింద్ స్వామి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తనను ఆదరించిన టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. తన ట్విట్టర్ పేజ్ ద్వారా ఆనందాన్ని వ్యక్తంచేసిన అరవింద్ స్వామి,,, తెలుగులో మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు ప్రకటించాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ ఈయనకి తెలుగు నేర్చుకోవటం మీద ఇంట్రెస్ట్ లేదట, రెమ్యున రేషన్ మీద మాత్రం బాగానే ఇంట్రస్టున్నట్టుంది మరి.

    Aravind Swamy Not Interested in Learning Telugu Now

    క్రేజ్ వచ్చింది కదా దాన్ని వాడేసుకొని మళ్ళీ తన సొంత ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ కో, ఎక్కువ డబ్బుక్లువచ్చే బాలీవుడ్ కో పోతాడన్న మాట. అయిన అరవింద్ స్వామి ఒక్కడేనా పరభాషా నటుడు... మరెందరో ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్తున్నారు. ఆఖరికి నోరు తిరగకున్న సాయాజీ షిండే లాంటి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుకూడా తెలుగు నేర్చుకొని మరీ తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

    సూర్య తమ్ముడు కార్తీ. తెలుగులో ఆయనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు 'ఊపిరి' సినిమాకు. ఎందుకంటే.. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ కూడా వుంది. అలానే రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీలాంటి ఉత్తరాది అమ్మాయిలు కూడా తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. తమన్నా అయితే... అనర్గళంగా మాట్లాడగలుతోంది కానీ.. ఇంకా డబ్బింగ్ చెప్పుకునేంత కాన్ఫిడెంట్ ఆమెకు లేదనిపిస్తోంది. ఇలా చాలా మంది పరభాషా తారలు తెలుగుపై ఆసక్తి చూపిస్తున్నారు.

    కానీ స్టైలిష్ విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి మాత్రం తెలుగు నేర్చుకోవడం ఇష్టం లేదట. ఇదే కాదు.. ఇప్పట్లో మరే ఇతర భాషలను నేర్చుకోవాలని కానీ... అందులో నటించాలని కానీ లేదని సెలవిచ్చాడు. దాదాపు పాతికేళ్ల క్రితమే ఈ హ్యాండ్స్ మ్ హీరో రోజా, బొంబాయి, మెరుపు కలలు, దళపతి లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్లో అడుగుపెట్టాడు. అయితే అప్పట్లో కూడా ఏం అంత అగ్రెసివ్ గా మూవీస్ చేయలేదు. మధ్యలో యాక్సిడెంట్ కారణంగా ఓ దశాబ్దం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.

    సొంత బిజినెస్ లు చూసుకుంటున్నాడు. కడలితో మళ్లీ విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పట్లో పరభాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పేంత ఓపిక ఎక్కడొస్తుందనుకున్నాడో ఏమో... తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెబుతారా అంటే.. అంత ఇంట్రెస్ట్ లేదు.. అంత ఓపిక లేదన్నాడు. విలన్ గా కూడా మూడుకోట్లు డిమాండ్ చేస్తున్న ఈ నటుడు ఆ మూడుకోట్ల కోసం తెరమీద కనిపించటం తప్ప మరేం చేయడన్నమాట... మిగతా సగం డబ్బింగ్ ఆర్టిస్టులతో చేయించుకోవాలి. అయినా మనం ఇంతగా వాళ్ళ వెనక పడ్డంత కాలం ఇలాగే ఉంటుంది పరిస్థితి... నటుడు అన్న గౌరవం మనకుంది.. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులూ, పని చూపిస్తున్న ఇండస్ట్రీ అన్న ఙ్ఞానం ఈయన గారికి లేదేమో

    English summary
    Tollywoods most wanted villion tamil actor Aravind Swamy Not Interested in Learning Telugu Now
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X