»   » తండ్రి చితికి నిప్పు పెట్టలే.. బతికి ఉంటే విలువ తెలియలే, నాన్నకు మాట చెప్పలే.. భోరున ఏడ్చిన ఎన్టీఆర్

తండ్రి చితికి నిప్పు పెట్టలే.. బతికి ఉంటే విలువ తెలియలే, నాన్నకు మాట చెప్పలే.. భోరున ఏడ్చిన ఎన్టీఆర్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  NTR Speech @Aravindha Sametha Pre Release Event

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న అరవింద సమేత.. వీర రాఘవ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్‌కు సిద్దమైంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ భోరున విలపించారు. తన తండ్రి హరికృష్ణను, త్రివిక్రమ్‌తో రిలేషన్ చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ఉద్వేగంగా మాట్లాడిన మాటలు ...

  త్రివిక్రమ్‌తో 12 ఏళ్ల కల

  త్రివిక్రమ్‌తో 12 ఏళ్ల కల

  అందరికి నమస్కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాలని 12 సంవత్సరాల నా కల. చాలా సార్లు అనుకొన్నాం. కుదర్లేదు. ప్రతీసారి ఏదో ఒక చిన్న అడ్డంకు కలిగేది. ఎలా చేయాలని ఎప్పుడూ ఆలోచించే వాడిని. నువ్వే నువ్వే చిత్రం తీయకు ముందు నుంచి దగ్గరైన మిత్రుడు.

  ఎందుకు చేయడం లేదని బాధ

  ఎందుకు చేయడం లేదని బాధ

  కష్ట, సుఖాలు మాట్లాడుకొనేందతగా స్నేహం ఉన్నా.. సినిమా ఎందుకు చేయడం లేదనే బాధ కలిగేది. ఎందుకు కుదర్లేదు అనుకొనే వాళ్లం. అభిమాన సోదరులు కూడా అనుకొని ఉంటారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన విషాద సంఘటన ఈ చిత్రానికి ముడిపడి ఉండొచ్చు. ఆయనతో సినిమా ప్రారంభించిన తర్వాతే అంటూ కంటతడిపెట్టారు.

  జీవిత సత్యం బోధపడింది

  జీవిత సత్యం బోధపడింది

  నెల క్రితం జరిగిన ఓ విషాద సంఘటన తర్వాత జీవిత సత్యం, విలువ బోధపడింది. ఈ సినిమా పరమార్థం ఒక్కటే. వాడిదైన రోజే వాడు గెలుస్తాడు. యుద్దం ఆపగలిగిన వాడే నిజమైన వీరుడు. మొనగాడు. జీవితంలో తెలిసి తెలియకో చాలా బాధలు, గొడవుల ఉంటాయి. జీవితమంటే కొట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడమే జీవితం. ఎలా బతుకాలో చెప్పేదే అరవింద సమేత వీర రాఘవ. మనిషిగా పుట్టిన ప్రతీ ఒక్కరు ఎలా బతికాలో చెప్పే సినిమా ఇది.

  మగవాడి పక్కన ఆడది

  మగవాడి పక్కన ఆడది

  అరవింద సమేత సినిమా టైటిల్ పెట్టినప్పుడు పవర్‌ఫుల్‌గా లేదే అన్నారు. కానీ ఓ మగవాడి పక్కన ఆడది ఉంటే అంతకంటే పవర్‌ఫుల్ ఏముంటుంది. గొప్ప చిత్రాన్ని ఇవ్వడానికి, నాకు పరిపక్వత వచ్చే వరకు వేచి చూసి దేవుడు త్రివిక్రమ్‌తో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా త్రివిక్రమ్ రూపంలో ఆత్మబంధువును ఇచ్చింది. కష్టసుఖాల్లో నా అండగా నిలిచే వారిలో త్రివిక్రమ్ ఉంటారు. నా జీవితంలో చిరస్థాయిగా మైలురాయిగా నిలిచిపోయే సినిమాగా మారుతుంది.

  ఎప్పుడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు

  ఎప్పుడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు

  అరవింద సమేత చిత్రం నాకు 28 సినిమా. అన్ని సినిమాల్లో నేను ఎప్పుడు తండ్రి చితికి నిప్పుపెట్టలేదు. ఏ దర్శకుడు పెట్టే సీన్ రాయలేదు. కానీ ఈ చిత్రంలో చితికి నిప్పుపెట్టడం యాదృచ్చికమైన విషాదాన్ని నింపింది. మనం ఈ నెల రోజులు అన్నగా, తండ్రిగా, మిత్రుడిగా, స్నేహితుడిగా త్రివిక్రమ్ నిలిచాడు. కొన్ని బంధాలు కలిసినప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తే బంధం బలపడుతుందని, మా నాన్న పై నుంచి మన బంధాన్ని చూస్తూ ఉంటాడు.

  తమన్‌ను తప్ప మరొకరిని ఊహించలేను

  తమన్‌ను తప్ప మరొకరిని ఊహించలేను

  అరవింద సమేత చిత్రానికి తమన్ తప్ప మరొకరిని ఊహించలేను. అద్భుతమైన సంగీతం ఇవ్వడానికి ప్రాణం పెట్టాడు. అందరూ అనుకొంటారు.. తమన్ ఏదో వాయిద్యాలు కొడుతాడు అనుకొంటారు. ఈ పాటలు రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ మాస్ హీరో. డ్యాన్సులు లేని పాటలు లేవు అందరూ అనుకొన్నారు. కానీ నేను డ్యాన్సర్ కంటే నేను నటుడిని. నటనలో భాగం డ్యాన్స్. డ్యాన్స్‌లో భాగం నటన కాదు. త్రివిక్రమ్‌ రాసిన అద్భుతమైన కథను తమన్ సంగీతాన్ని అందించడానికి ఎంత నలిగిపోయాడో నాకు తెలుసు. అందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అద్భుతమైన మ్యూజిక్‌ను అరవింద సమేతకు తమన్ ఇచ్చినందుకు ధన్యుడిని.

  త్రివిక్రమ్‌తో రిలేషన్

  త్రివిక్రమ్‌తో రిలేషన్

  త్రివిక్రమ్ శ్రీనివాస్, నాకు ఓ రిలేషన్ ఉంది. మా ఇద్దరి బంధానికి ఓ పిల్లర్ ఉంది. మేము నిలబడిన ఓ వేదిక ఉంది. అది అరవింద సమేత సినిమా కాదు. ఆ వేదిక నిర్మాత చినబాబు. సినిమా తీస్తే కమర్షియల్‌గా ఆలోచించరు. సినిమాను అద్భుతంగా రూపొందించాలని ఎప్పుడూ ఆలోచిస్తారు. ఎంత తాపత్రయం పడుతారో మరోసారి చూశాను. ఈ సినిమాను అద్భుతంగా రూపొందించినందుకు చినబాబు థ్యాంక్స్.

  అరవింద సమేతలో జగపతిబాబు

  అరవింద సమేతలో జగపతిబాబు

  అరవింద సమేతలో జగపతి బాబు పాత్ర చాలా కీలకం. అద్బుతం. జగపతి బాబు లేకపోతే అరవింద సమేత లేదు. గొప్ప నాయకుడు లేకపోతే నాయకుడు కనిపించడు. పొద్దున చూస్తే రాత్రి కలలోకి వస్తాడు అని జగపతిబాబు గురించి సునీల్ చెప్పిన మాట వాస్తవం. సినిమా చూసిన తర్వాత మొదలు జగపతిబాబు గురించి చెప్పిన తర్వాతే మిగితావారి గురించి చెప్పుకొంటారు.

  నవీన్ చంద్ర పాత్ర గురించి

  నవీన్ చంద్ర పాత్ర గురించి

  జగపతి బాబు ప్రతినాయకుడి వెనుక మరో ప్రతి నాయకుడు నవీన్ చంద్ర ఒకరు. అందాల రాక్షసి సినిమా చూసి నేను ఆయనను ఇష్టపడ్డాను. అలాంటి నవీన్ ఈ చిత్రంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అరవింద సమేత చిత్రంలో ప్రాణం పెట్టి నటించిన ప్రతీ ఒక్క నటీనటులు, సాంకేతిక నిపుణులు థ్యాంక్స్.

  తండ్రి విలువ తెలియలేదు

  తండ్రి విలువ తెలియలేదు

  ఒక నెలరోజుల నుంచి చాలా విషయాలు మనసులో పెట్టుకొన్నాను. మేమిద్దరం మాట్లాడటం మానేశాం. మనిషి బతికి ఉన్నప్పడు వాళ్ల విలువ తెలియదు. మనిషి చనిపోయిన తర్వాత ఆయన విలువ తెలుస్తుంది. ఓ తండ్రికి అంత గొప్ప కొడుకు ఉండడు. ఓ కొడుకుకు గొప్ప తండ్రి ఉండడు. ఓ గొప్ప భార్యకు గొప్ప భార్త నా తండ్రి. ఒక మనవడికి అంత గొప్ప తాత ఉండరు. మీరు ఓ మహానుభావుడి కడుపున పుట్టారు. నా కడుపులో మీరు పుట్టాను. మనందరినీ మోసేది మన అభిమానులు మాత్రమే. నాన్న బతికి ఉన్నప్పుడు అభిమానులను జాగ్రత్తగా చూసుకోమని మానాన్న ఎప్పడూ చెప్పేవాడు.

  మా నాన్న ఈ సినిమా చూస్తే

  మా నాన్న ఈ సినిమా చూస్తే

  మా నాన్న ఒక్క సినిమా చూస్తే బాగుండనిపిస్తుంది. ఏం చేస్తాం. మనకు ఆయన అవసరం ఎంతుందో తెలియదు. కానీ మా నాన్న అవసరం పైవాడికి అవసరముందేమో. ప్రతీ ఫంక్షన్‌లో ఎప్పుడూ మా తాత బొమ్మను చూశాను. కానీ అక్కడ మా నాన్న ఫొటో అంత త్వరగా వస్తుందని అనుకోలేదు. మా నాన్నకు ఇచ్చిన మాటను మీకు చెబుతున్నా. మా జీవితం మీకే అంకితం అంటూ కంటతడితో ప్రసంగాన్ని ముగించాడు.

  మా నాన్నకు చెప్పలేకపోయాను

  మా నాన్నకు చెప్పలేకపోయాను

  మీకు ఒక మాట చెప్పాలనుకొంటున్నాను. ఆ మాటను నాన్నకు చెప్పలేకపోయాను. అది మీకు చెప్పాలనుకొంటున్నాను. మనం నడిరోడ్డు మీద నిలబడినప్పుడు ఫ్యామిలీనే అండగా ఉంటుంది. మనకు కుటుంబమే ముఖ్యం. ఆ తర్వాతే మేము. మన కోసం ఇంటి వద్ద మన ఫ్యామిలీ ఉంటుందని గుర్తుంచుకోవాలి. వారి గురించి మనం ఆలోచించాలి. క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అని ఎన్టీఆర్ అన్నాడు.

  English summary
  NTR, Trivikram Srinivas's Aravinda sametha has sky high expections. This movie teaser, First Look got good response from fans. Now Aravinda Sametha juke box came out into the market. Four songs have good lyrical values. This movie set to release on October 11th.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more