కనుముకులలో ఎన్టీఆర్.. జోరుగా అరవింద సమేత చిత్రీకరణ!

By Rajababu

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న అరవింద సమేత చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రంలోకి కీలక సన్నివేశాలను తెలంగాణలోని భువనగిరి జిల్లాలోని ఓ ప్రముఖ దేవాలయంలో షూట్ చేస్తున్నారు. దసరా కానుకగా రాబోతున్న ఈ చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్ మూడో వారంలోగా ముగించాలన్న లక్ష్యంతో చిత్ర యూనిట్ అహర్నిశలు కృషి చేస్తున్నది.

ఎన్టీఆర్‌తో పూజా హెగ్డే, ఇషా రెబ్బాతో పాటు కీలక పాత్రధారులపై సన్నివేశాలను భువనగిరికి సమీపంలోని కనుముకుల వెంకటేశ్వర ఆలయంలో చిత్రీకరిస్తున్నారు. అలాగే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను ఆగస్టు రెండో వారం గానీ, మూడో వారం గానీ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సెప్టెంబర్‌ చివరి వారంలో థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Aravindha Sametha Shooting going at Kanumukula Venkateshwara Temple

అరవింద సమేత చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌తో కలిసి థమన్ పనిచేయడం ఇదే మొదటిసారి. ఈ చిత్రానికి అనిరుధ్‌ను
తొలుత మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో అతడిని పక్కన పెట్టారనే రూమర్ వినిపించింది.

అజ్ఞాతవాసి దారుణమైన ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రూపొందిస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కెరీర్‌లో మరో సక్సెస్‌ను చేర్చడానికి చిత్రాన్ని విభిన్నంగా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X