»   » ‘అరవింద సమేత’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... రేటింగ్ 4/5

‘అరవింద సమేత’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... రేటింగ్ 4/5

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Aravindha Sametha Veera Raghava Movie First Review Comes Out

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత' సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలిసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని అభిమానుల్లో కల్పించాయి. తాజాగా యంగ్ టైగర్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపుతూ పస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ కాపీ చూసిన అనంతరం ఉమైర్ సంధు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. అతడు సినిమా గురించి ఏ చెప్పాడో ఓ లుక్కేద్దాం.

  అరవింద సమేత 4/5 రేటింగ్

  అరవింద సమేత 4/5 రేటింగ్

  అరవింద సమేత బ్లాక్ బస్టర్ బొమ్మ అని తేల్చేసిన ఉమైర్ సంధు... ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చాడు. దీన్ని బట్టి సినిమా భారీ బ్లాక్ బస్టర్ ఖాయం అనే నమ్మకం అభిమానుల్లో మరింత ఎక్కువైంది. ఉమైర్ సంధు సినిమాలోని మేజర్ పాయింట్స్ గురించి చెప్పిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

  ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరైజేషన్ మేజర్ హైలెట్

  ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరైజేషన్ మేజర్ హైలెట్


  ఈ సినిమాలో మేజర్ హైలెట్ ఎన్టీఆర్ లుక్, క్యారెక్టరైజేషన్ అని, యంగ్ టైగర్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమా చూస్తున్న వారిలో మరింత ఆసక్తి పెంచుతుందని ఉమైర్ సంధు తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో క్యారెక్టర్‌ను బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతంగా ఉందన్నారు. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ మాడ్యులేషన్ పీక్స్ అనేలా ఉంటుందని తెలిపారు.

   త్రివిక్రమ్ అదరగొట్టాడు

  త్రివిక్రమ్ అదరగొట్టాడు

  మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఇందులో మరోసారి అద్భుతమైన డైలాగులతో ప్రేక్షకులను మెప్పించాడని, అతడు రాసిన డైలాగులు ప్రేక్షకుల మీద చాలా ఇంపాక్ట్ చూపే విధంగా ఉన్నాయని ఉమైర్ సంధు తెలిపారు.

   స్క్రీన్ ప్లే అదిరిపోయింది

  స్క్రీన్ ప్లే అదిరిపోయింది

  త్రివిక్రమ్ సినిమాను నడిపించిన తీరు ది బెస్ట్ అనేలా ఉంది. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ నుండి తనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. పూజా హెగ్డే కూడా చాలా బాగా చేసిందని ఉమైర్ సంధు తెలిపారు.

   ఈ దసరాకు పర్ఫెక్ట్ గిఫ్ట్

  ఈ దసరాకు పర్ఫెక్ట్ గిఫ్ట్

  ‘అరవింద సమేత' అభిమానులకు ఒక పండగలా ఉంటుంది. ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, మాస్ స్టోరీ, హై ఆక్టేన్ యాక్షన్, రాకింగ్ మ్యూజిక్, సూపర్ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ సినిమాకు మేజర్ హైలెట్స్. ఈ దసరాకు పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటూ ఉమైర్ సంధు పొగడ్తలు గుప్పించారు.

  ఉమైర్ సంధు రివ్యూను నమ్మడం కష్టమే

  ఉమైర్ సంధు రివ్యూను నమ్మడం కష్టమే

  అయితే ఉమైర్ సంధు రివ్యూల విషయంలో చాలా మంది అప నమ్మకంగా ఉన్నారు. త్రివిక్రమ్ గత చిత్రం ‘అజ్ఞాతవాసి' విషయంలో కూడా ఇలాగే 4/5 రేటింగ్ ఇచ్చి బ్లాక్ బస్టర్ సినిమా అంటూ పొగిడేశాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  English summary
  Jr NTR's Aravindha Sametha Veera Raghava movie first review comes out. First Review was given by popular critic Umair Sandhu. Umair Sandhu wrote, “First Review #AravindhaSametha. #JrNTR looks a million bucks and is the major highlight of the film. The way he has balanced his character especially during the climax is out standing. NTR’s body language and dialogue modulation are at peaks during this part. It has everything which #JrNTR fans can eagerly look forward to. NTR’s stylish look, Mass Story, High Octane Action, Rocking Music and super strong characterization are major assets of the film. Perfect Gift for #Dussehra.””
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more