బాలయ్య‌తో నేను చేస్తున్నది ఐటం సాంగ్ కాదు: అర్చన

By Bojja Kumar

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సత్య దేవ్ దర్వకత్వంలో 98వ చిత్రంగా‘లయన్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లు. తాజాగా ఈ చిత్రంలో తెలుగు గర్ల్ అర్చన కూడా జాయినైనట్లు తెలుస్తోంది. ఆమె ఈ చిత్రంలో కొన్ని ఇంపార్టెంట్ సీన్లతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. ఇటీవలే ఆ సాంగ్ చిత్రీకరణ కూడా పూర్తయిందట.

ఈ సాంగ్ గురించి అర్చన మాట్లాడుతూ...నేను చేస్తున్న సాంగ్ ఐటం సాంగ్ కాదు. అదో సిచ్యువేషనల్ సాంగ్. సినిమా కథలో భాగంగా సాగిపోతుంది. అంతే కానీ అది ఐటం సాంగ్ కాదు అన్నారు. ఈ సినిమాలో నటించడంపై అర్చన ఆనందం వ్యక్తం చేసింది. గతంలో అర్చన బాలయ్యతో పాండురంగడు, పరమవీర చక్ర చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Archana to sizzle in Balayya’s ‘Lion’

సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘లయన్' శాటిలైట్ హక్కులు విడుదలకు ముందే అమ్ముడయ్యాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ 6 కోట్లకు ‘లయన్' శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X