»   » చక్కని కాన్సెప్ట్‌తో ‘ఆర్ యు మ్యారీడ్ ?’

చక్కని కాన్సెప్ట్‌తో ‘ఆర్ యు మ్యారీడ్ ?’

Posted By:
Subscribe to Filmibeat Telugu

మౌర్య , చరిష్మా హీరో హీరోయిన్లుగా సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రం గా నిర్మిస్తున్న సినిమా '' ఆర్ యు మ్యారీడ్ ?'' .రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అళహరి దర్శక నిర్మాత. ఫిలిం ఛాంబర్ లో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. హీరో హీరోయిన్ ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ క్లాప్ నివ్వగా ,,ప్రవాస భారతీయుడు చిట్టిమల్ల రఘు కెమెరా స్విచ్ ఆన్ చేసారు..

Are You Married movie shooting started

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అళహరి మాట్లాడుతూ '' ఎవరి ఊహలకు అందని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను..గ్రాఫిక్ వర్క్‌తో భారీ బడ్జెట్‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 23 నుండి ప్రారంభం అవుతుంది. పెళ్లీడుకొచ్చిన యువతీ యువకుల భావోద్వేగాలను, ప్రసుత జనరేషన్ లైఫ్ స్టైల్ ని ఈ సినిమా ద్వారా చూపించనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతి లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని'' చెప్పారు.

Are You Married movie shooting started

మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ.. చక్కని కాన్సెప్ట్‌తో నిర్మితమవుతున్న సినిమా ఇది అని చెప్పారు. '' కాన్సెప్ట్ నచ్చి ఈ ప్రాజెక్టులో భాగస్వామినయ్యానని ఎన్ఆర్ఐ చిట్టిమల్ల రఘు చెప్పారు.. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ నర్సింగ్ రావు, సంగీత దర్శకుడు జయ సూర్య, రచయిత కాంచనపల్లి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

English summary
Are You Married movie shooting started in hyderbad. Mourya and Charishma are lead pair. Alahari is the producer cum director for the movie. Producer Malkapuram Shiva Kumar othres attended for opening shot of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu