»   » క్రేజీ కాంబో కదా: నితిన్ కు విలన్ గా అప్పటి యాక్షన్ హీరో

క్రేజీ కాంబో కదా: నితిన్ కు విలన్ గా అప్పటి యాక్షన్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని కాంబినేషన్స్ వినగానే చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. అలాంటి కాంబోని సెట్ చేసిన వాళ్లను శభాష్ అని మెచ్చుకోవాలనిపిస్తుంది. త్రివిక్రమ్ తో చేసిన'అ..ఆ..' సూపర్ హిట్ తర్వాత ఆ స్థాయికి తగ్గ సినిమాయే చేయాలన్న ఆలోచనతో నితిన్, చాలా గ్యాప్ తీసుకొని హను రాఘవపూడి సినిమా మొదలుపెట్టారు. ఈ చిత్రంలో విలన్ గా ఎంపిక చేసిన నటుడుని గురించి తెలుసుకుంటే సూపర్ అంటాం.

పూర్తి వివరాల్లోకి వెళితే...నితిన్‌, మేఘ ఆకాష్‌ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. హను రాఘవపూడి దర్శకుడు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. అర్జున్‌ విలన్ గా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు స్టార్‌గా వెలుగొందిన అర్జున్ ఈ చిత్రంలో చేస్తూండటంతో ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తోంది. నితిన్-అర్జున్‌ల మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని చెప్తున్నారు.

Arjun as villain in Nithin's movie

దర్శకుడు మాట్లాడుతూ ''నితిన్‌ ఇందులో పాతబస్తీ కుర్రాడిగా కనిపిస్తారు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ కథలో అర్జున్‌ విలన్ గా నటిస్తున్నారు. ఆయన పాత్ర స్టైలిష్‌గా ఉంటుంది. అర్జున్‌ తప్ప మరెవ్వరూ చేయలేని పాత్ర ఇది''అన్నారు.

అర్జున్‌ మాట్లాడుతూ ''నటుడిగా తృప్తినిచ్చే పాత్రని ఇందులో చేస్తున్నా. 'ఒకే ఒక్కడు', 'జెంటిల్‌మేన్‌' స్థాయిలో గుర్తింపు తెచ్చే పాత్ర ఇది. దీని కోసం కసరత్తులు మొదలుపెట్టాన''అన్నారు.

గోపీచంద్‌ ఆచంట మాట్లాడుతూ ''ఈ నెల 6న హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలుపెట్టాం. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ''అన్నారు.

English summary
Arjun Sarja has now switched to villain roles or character roles. In director Hanu Raghavapudi's new film with Nithin as hero, he has been roped in to perform the main villain's role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu