»   »  అమేజింగ్: "లై" అర్జున్ ఫస్ట్ లుక్

అమేజింగ్: "లై" అర్జున్ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్ హీరో 'నితిన్' తాజా చిత్రం 'లై' షూటింగ్ సైలెంట్ గా కొనసాగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ శాతం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో 'నితిన్' వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 'లై' అనే మాటకు 'లవ్..ఇంటలిజెన్స్..ఎనిమీ' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. మేఘా ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో సీనియర్ హీరో అర్జున్ కనిపించనున్నాడు.

తాజాగా ఆయన ప్రీ లుక్ ను వదిలారు. బాత్ టబ్ లో అర్జున్ సేదదీరుతుండగా వెనుక నుంచి తీసిన స్టిల్ ను ప్రీ లుక్ గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అర్జున్ మెడ భాగంలో వున్న టాటూ ఆయన పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. అది చూసిన షాక్నుంచి ఇంకా తేరుకోకముందే అర్జున్ లుక్ కూడా వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో అర్జున్ చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. ఏదో చేయాలి .. ఎలా చేయాలి? అనే ఒక ద్వేషం నిండిన లుక్ తో ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు.


 Arjun first look in LIE

అర్జున్ లుక్ ను మాత్రమే కాదు .. ఆయన పాత్రను కూడా హను రాఘవపూడి వెరైటీగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'అ ఆ' తరువాత తనకి ఆ స్థాయి హిట్ ఈ సినిమాతో లభిస్తుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు. కొత్తగా ఆయన చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి కావచ్చింది. ఆల్రెడీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 11న 'లై' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.


English summary
Action King Arjun first look out from makers of LIE Movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu