»   » అపుడు శ్రీదేవిని ద్వేషించాడు: మరణం తర్వాత సవితి కొడుకు ప్రవర్తన ఎలా ఉందంటే...

అపుడు శ్రీదేవిని ద్వేషించాడు: మరణం తర్వాత సవితి కొడుకు ప్రవర్తన ఎలా ఉందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి శ్రీదేవి మరణం తర్వాత చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి సవితి కొడుకు అర్జున్ కపూర్ ప్రవర్తన బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. అర్జున్ కపూర్.... బోనీ కపూర్ మొదటి భార్య మోనా కొడుకు అనే సంగతి తెలిసిందే.

చిన్నతనం నుండి శ్రీదేవి అంటే ద్వేషమే

చిన్నతనం నుండి శ్రీదేవి అంటే ద్వేషమే

తన తల్లి తండ్రి విడిపోవడానికి కారణమైన శ్రీదేవితో అర్జున్ కపూర్ చిన్నతనం నుండి అంటీ ముట్టనట్లే ఉండేవాడు. అతడు హీరో అయ్యాక పలు ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి ఎదురైన ప్రశ్నలకు కాస్త కరుకుగానే సమాధానాలు ఇచ్చేవాడు. ఆమె తన తండ్రి భార్య మాత్రమే, తనకు తల్లి కాదని అంటుండేవాడు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మరణంపై అర్జున్ కపూర్ ఎలా స్పందిస్తారనే విషయమై అంతా ఎదురు చూశారు.

 శ్రీదేవి మరణ వార్త విన్న వెంటనే

శ్రీదేవి మరణ వార్త విన్న వెంటనే

శ్రీదేవి మరణ వార్త విన్న వెంటనే అర్జున్ కపూర్ తన సినిమా షూటింగ్ రద్దు చేసుకున్నారు. షూటింగ్ నిమిత్తం బయటి ప్రాంతంలో ఉన్న ఆయన వెంటనే ముంబై చేరుకున్నారు. బాబాయ్ అనిల్ కపూర్ ఇంటికి వెళ్లి దుబాయ్‌లో జరుగుతున్న పరిణామాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

 చెల్లెళ్లలతో అంటీ ముట్టనట్లే

చెల్లెళ్లలతో అంటీ ముట్టనట్లే

ఒకే తండ్రి బిడ్డలు అయినప్పటి.... తల్లులు వేరు కావడం, వారి మధ్య సవితిపోరు, ద్వేషం ఉండటంతో జాహ్నవి కపూర్, ఖుషి కపూర్‌లతో అర్జున్ కపూర్ అంటీ ముట్టనట్లుగానే ఉండేవారు. తాము ఎప్పుడూ సరిదాగా గడపలేదని, తమ మధ్య అలాంటి సఖ్యత లేదని గతంలో పలు సందర్భాల్లో అర్జున్ కపూర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

 చెల్లి వద్దకు వెళ్లి ఓదార్పు

చెల్లి వద్దకు వెళ్లి ఓదార్పు

శ్రీదేవి మరణ వార్త విన్న వెంటనే అర్జున్ కపూర్... ‘ధడక్' షూటింగ్ నిమిత్తం ఇండియాలోనే ఉండిపోయిన చెల్లి జాహ్నవి వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చారు. ఎన్నడూ లేని విధంగా అర్జున్ వచ్చి స్వయంగా జాహ్నవిని కలవడంతో అంతా ఆశ్చర్యపోయారు.

 తల్లిలేని లోటు అతడికి తెలుసు కాబట్టే

తల్లిలేని లోటు అతడికి తెలుసు కాబట్టే

అర్జున్ కపూర్ తల్లి మోనా కపూర్.... అతడి మొదటి సినిమా విడుదలకు రెండు నెలల ముందు మరణించిన సంగతి తెలిసిందే. తల్లి లేని లోటును, ఆ బాధను అనుభవించాడు అర్జున్. ఆ పెయిన్ ఎలా ఉంటుందో అతడికి బాగా తెలుసు. అందుకే వెంటనే వచ్చి తన చెల్లిని ఓదార్చాడు.

మీడియాతో మాట్లాడటానికి నిరాకరణ

మీడియాతో మాట్లాడటానికి నిరాకరణ

అయితే శ్రీదేవి మరణంపై స్పందించడానికి అర్జున్ కపూర్ నిరాకరించారు. మీడియా ఎదురైతే ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఇకనైనా బాధ్యత తీసుకుంటాడా?

ఇకనైనా బాధ్యత తీసుకుంటాడా?

ఇంతకాలం శ్రీదేవి, మోనా పిల్లలు వేర్వేరుగానే ఉన్నారు. ఇకపై బోనీ కపూర్ తన పిల్లలను ఏకం చేస్తాడా? అర్జున్ కపూర్ అన్నయ్యగా చెళ్లెల్ల బాధ్యతలను చూసుకుంటాడా? వెయింట్ అండ్ సీ. అభిమానులు మాత్రం అంతా కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.

English summary
Legendary actress Sridevi’s sudden demise has left the entire country in shock. While according to reports, the mortal remains of Sridevi today or tomorrow, Arjun has already landed in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu