»   » పబ్లిసిటీకి పరాకాష్ట: రేడియో జాకీపై అర్జున్ కపూర్ దాడి (వీడియో)

పబ్లిసిటీకి పరాకాష్ట: రేడియో జాకీపై అర్జున్ కపూర్ దాడి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పబ్లిసిటీకి పరాకాష్ట అంటే ఇదేనేమో! బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ చేసిన పని చూసిన చాలా మంది అంటున్న మాట ఇది. తన తాజా సినిమా 'కి అండ్ కా' సినిమా ప్రమోషన్లో భాగంగా ముంబైలోని రేడియో మిర్చి కార్యాలయానికి వెళ్లిన అర్జున్ కపూర్ అక్కడ ఆర్.జె అడిగిన ప్రశ్నకు సహనం కోల్పోయి అతనిపై దాడి చేసాడు. కెమెరాలను విసిరికొట్టాడు.

స్టుపిడ్ గా ప్రవర్తించను, ముద్దు సీన్ పై కరీనా కపూర్ భర్త (ఫోటోస్)

సినిమాల్లో నటించడానికి పాత్రలు దొరకక పోవడంతోనే అమ్మాయిలకు సంబంధించిన పాత్రలు వేస్తున్నారా అంటూ... అర్జున్ కపూర్ ను రేడియో జాకీ ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన అర్జున్ కపూర్ అతని చెంపచెల్లుమనిపించాడు. ఈ వీడియో చూసిన చాలా మంది అర్జున్ ఇలా చేసాడేంటి? అనుకున్నారు.

సెక్సీ లుక్: 'పరిణితి' చెందిన అందాలు ( హాట్ ఫోటోస్)

కానీ ఇదంతా ఏప్రిల్ 1న అందరినీ ఫూల్స్ చేయడానికి తీసిన వీడియో. 'కి అండ్ కా' చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతుండటంతో సినిమా ప్రమోషన్లో భాగంగా అందరినీ ఏప్రిల్ ఫూల్ చేయడానికి రేడియో మిర్జి టీం, అర్జున్ కపూర్ కలిసి ఇలా చేసారు. కొత్తగా ఉంటుందని ఇలా చేసినా...ఈ వీడియో చూసిన వారు మాత్రం పబ్లిసిటీ కోసం ఇంత చెత్తగా ప్రవర్తించాలా? అంటున్నారు.

అర్జున్‌కపూర్‌, కరీనాకపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కి అండ్‌ కా'. ఆర్‌.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రానికి ఇళయరాజా స్వరాల్ని సమకూరుస్తున్నారు. అమితాబ్‌బచ్చన్‌, జయాబచ్చన్‌లు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తొలిసారిగా అర్జున్‌, కరీనాలు జంటగా నటిస్తున్నారు. భర్త ఇంటి పనులు చేసుకోవడం, భార్య ఉద్యోగం చేయడం అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Arjun Kapoor slapped a Radio Jockey

ఈచిత్రం గురించి కరీనా మాట్లాడుతూ..భారతీయ సమాజంలో పెళ్ళైన భార్యభర్తల మధ్య మగ, ఆడ అనే జెండర్‌ తేడా ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుందనే పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది. భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచిన ఇటువంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. అర్జున్‌ కపూర్‌, అమితాబ్‌, జయాబచ్చన్‌ వంటి వారితో నటించటం మరచిపోలేని అనుభూతినిచ్చింది' అని తెలిపారు.

English summary
Believe it or not, this has happened. While promoting his film Ki and Ka, Arjun Kapoor was in the Radio Mirchi office when a question from the RJ ticked him off.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu