twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్లు అలాంటి పరిస్థితుల్లోనా?

    By Bojja Kumar
    |

    హీరోయిన్ల ఇంకా ఇన్ సెక్యూర్(అభద్రత) పరిస్థితుల్లో ఉన్నారంటే ఆశ్యరం వేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్. కరీనా కపూర్ టైటిల్ రోల్ చేస్తున్న 'హీరోయిన్' చిత్రంలో అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. ఈ సంద్భంగా ఓ ప్రముఖ ఆంగ్ల దిన పత్రికతో తన అభిప్రాయాలు పంచుకున్నారు.

    హీరోయిన్లు అరక్షిత పరిస్థితుల్లో ఉండే వారంటే నాకు ఇప్పటికీ ఆశ్యర్యమే. సినిమాకు సంబంధించిన ఏ విభాగంలోనూ వారి ప్రమేయం ఉండదు. కేవలం మేకప్ రూమ్‌లో మేకప్ వేసుకుని దర్శకుడు చెప్పినట్లు వినడమే వారి పని. అదే హీరోలు అయితే అనేక విభాగాల్లో కలుగ జేసుకుంటారు. ఎందుకంటే అతని చుట్టే సినిమా మొత్తం నడుస్తుంది కాబట్టి.

    కానీ 'హీరోయిన్' సినిమా పూర్తిగా అందుకు భిన్నం. సినిమా మొత్తం కరీనా కపూర్ చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రంలో నేను సూపర్ స్టార్ పాత్ర చేస్తున్నాను. కరీనాకు, నాకు మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది డిఫరెంట్ రోల్. హీరోయిన్లు ఇన్ సెక్యూర్ పరిస్థితుల్లోకి ఎలా వెలుతున్నారనేది ఈ చిత్రంలో చూడొచ్చు అని చెప్పుకొచ్చారు.

    సినిమా వివరాల్లోకి వెళితే....సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. కథలో భాగంగా మితిమీరిన రొమాన్స్, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటి సినిమాలో తప్పనిసరి. దర్శకుడు మధుర్ ఊహించినట్లే సెన్సార్ బోర్డు ఈచిత్రం పెద్దలకు మాత్రమే పరిమితం అని సర్టిఫికెట్ ఇచ్చింది. సెప్టెంబర్ 21వ తేదీన ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    
 "I still wonder why (actresses get insecure), as they don't sit on edit table, or discuss budget, or are present in producer's meeting, or involved at scripting stage, they sit with hair and make-up done," Arjun said. Arjun Rampal essays the role of a superstar in Madhur Bhandarkar's magnum opus 'Heroine'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X