»   » కాపురాలు కూల్చాల్సిన అవసరం నాకు లేదు

కాపురాలు కూల్చాల్సిన అవసరం నాకు లేదు

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, అతని భార్య సుజానె రోషన్ విడిపోతున్నట్లు వారే స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి పేజ్ 3 సర్కిల్‌లో మరో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో హృతిక్-సుజానే విడిపోవడం వెనక అతని ప్రమేయం ఉందని మీడియాలో ప్రచారం మొదలైంది.

  వాస్తవానికి హృతిక్ రోషన్, అర్జున్ రాంపాల్ మంచి స్నేహితులు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. అయితే ఇటీవలి కాలంలో అర్జున్ రాంపాల్ సుజానేతో ఎక్కువగా కనిపిస్తుండం, చనువుగా కనిపిస్తుండటంతో.....అందరూ అతనే కారణమేమో అని అనుమానాలూ అందరిలోనూ మొదలైంది.

   Arjun Rampal Is Not The Man Behind Hrithik-Sussanne Split

  అయితే తనపై ఇలాంటి వార్తలు ప్రచారంలోకి రావడంపై అర్జున్ రాంపాల్ అసంతృప్తి వ్యక్తం చేసారు. తనకు హృతిక్, సుజానె మంచి స్నేహితులు....నా వల్ల వారు విడిపోయారనే వార్తలు విని షాకయ్యాను, అయినా నాకు అలాంటి అవసరం ఏముంది? ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలు అని అర్జున్ రాంపాల్ ఖండించారు.

  తన భార్య తన నుండి డిపోవాలని కోరుకుంటోందని, తమ బంధం తెగిపోతోందని మీడియాకు వెల్లడించారు హృతిక్. అయితే వీరు విడిపోవడానికి కారణాలు అనేకం వినిపిస్తున్నాయి. కైట్స్ సినిమా సమయంలోనే అందులో నటించిన బార్బరా మోరీతో హృతిక్ సన్నిహితంగా మెలగడం సుజానెకు నచ్చలేదని, ఆ సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. అయితే ఆతర్వాత ఇద్దరు సజావుగానే కాపురం సాగించారు.

  ఈ మధ్య అత్త మామలతో సుజానెకు అస్సలు పడటం లేదని, వేరు కాపురం పెడదామంటే హృతిక్ పట్టించుకోవడం లేదని, భర్త కూడా తనకు సపోర్టుగా నిలవక పోవడాన్ని సుజానె జీర్ణించుకోలేక పోయిందని వార్తలు వెలువడ్డాయి. ఈ కారణంగనే హృతిక్‌తో విడిపోవాలని సుజానె నిర్ణయించుకుందనే వార్తలు సైతం వినిపించాయి. తాజాగా ఇపుడు ఆ వార్తలు నిజం అయ్యాయి.

  చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. ఇప్పుడు సుజానె తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు హ్రెహాన్, హృదాన తండ్రి హృతిక్ రోషన్‌తో కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలను తమ తల్లిని గ్రాండ్ ఫాందర్ ఇంటికి వెళ్లి కలుస్తున్నారట.

  English summary
  
 Arjun Rampal's name was featured in the most unfair way in Page 3 columns since Hrithik-Sussanne divorce news broke out. Some film media indicated that there is a man behind the split; a man who is also Hrithik's friend but has started seeing Sussanne recently. Rumour mills aggressively reported that Arjun Rampal is the man in question.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more