»   » పస్తులున్న రోజులున్నాయ్: "అర్జున్‌రెడ్డి" షాలినీ చేదు అనుభవాలు

పస్తులున్న రోజులున్నాయ్: "అర్జున్‌రెడ్డి" షాలినీ చేదు అనుభవాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలలు కనటానికీ, వాటిని నెరవేర్చుకోవటానికీ కష్టపడాలి...పడుతూనే ఉండాలి. నిజానికి కష్టం కాదేమో అది ప్రయత్నం, కలని చేరటానికి పడేతపన. ఈ ప్రయత్నం అన్ని రంగాల్లో ఏమో గానీ గ్లామర్ ఫీల్డ్ అనిపించుకునే సినీ రంగానికి మాత్రం మరింత ఎక్కువ అవసరం. మామూలుగా అబ్బాయిలనే సినిమా వైపు వెల్లనివ్వరు తల్లితండ్రులు ఇక అమ్మాయిలైతే? నూటికి 99 శాతం మంది ఆమెని ఆపాలనే చూస్తారు, అడ్డుకోవాలనే చూస్తారు. ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ లో మహిళల మీద ఉండే చిన్న చూపు, ఆమె మీద వచ్చే రకరకాల గాసిప్పులూ మామూ కుటుంబాలలో భరించలేరు. ఇప్పుడంటే హీరోయిన్ అయ్యింది గానీ నిన్నా మొన్నటి వరకూ చాలాకష్టాలనే ఎదుర్కొందట "అర్జున్ రెడ్డి" హీరోయిన్ షాలినీ పాండే. ఇదివరకే కొన్ని ప్రెస్ మీట్ లలో కొంత చెప్పిన షాలిని ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని సంగతులు చెప్పింది...

 షాలినీపాండే

షాలినీపాండే

'అర్జున్ రెడ్డి' హీరోయిన్ షాలినీపాండే ఈ సినిమా చేయకముందు అనుభవించిన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వస్తున్న పలు కథనాలు ఆసక్తిరేపుతున్నాయి. చదువుకునే రోజుల్లోనుండే సినిమా రంగంలోకి రావాలని కలలుకన్న ఈమె థియేటర్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా పొందిందట.

చాలా కష్టాలు అనుభవించిందట

చాలా కష్టాలు అనుభవించిందట

కానీ సినిమాల్లోకి రావడానికి తండ్రి విభేదించడంతో ఇంట్లోనుండి పారిపోయి చాలా కష్టాలు అనుభవించిందట. షాలినీ తండ్రి ఆమెను ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే ఓ దశలో తండ్రిపై పోలీస్ కేసు పెట్టడానికి కూడా సిద్ధపడిందట షాలినీ. దీంతో ఇక ఎప్పుడుకూడా ఇంటి గడప తొక్కొదని తండ్రి వార్నింగ్ ఇవ్వడంతో ఓ చిన్న గదిలో ఉంటూ దుర్భరజీవితం గడిపిందని సమాచారం.

 పస్తులుండటం

పస్తులుండటం

డబ్బులు తక్కువగా ఉండటంతో ఒక్కోసారి పస్తులుండటం, ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్లి రావడం లాంటి కష్టాలెన్నో ఎదుర్కొందట. 'అర్జున్ రెడ్డి' సినిమా ఆఫర్ వచ్చాక సినిమా షూటింగ్ ప్రారంభానికి కొన్నిరోజుల సమయం ఉండటంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆ గదిలోనే ఉంటూ నరకం అనుభవించిందట షాలినీ.

తొలి ప్రయత్నంలోనే

తొలి ప్రయత్నంలోనే

ఎలాగోలా కష్టాలనుదాటి కొందరు స్నేహితుల సహకారంతో 'అర్జున్ రెడ్డి' సినిమాలో అవకాశం సంపాదించిన ఈమె తొలి ప్రయత్నంలోనే తనను విమర్శించిన వారితోనే ప్రశంసలు అందుకుంటుండటం విశేషం. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షాలిని పాండే పేరు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో నానుతోంది.

English summary
Recently during the media interaction, Shalini spoke about her Struggle full past life
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu