»   » ‘అర్జున్ రెడ్డి’...అసలే భారీ హైప్, ఆపై కాంట్రవర్సీలు, కుమ్ముడు మొదలైంది!

‘అర్జున్ రెడ్డి’...అసలే భారీ హైప్, ఆపై కాంట్రవర్సీలు, కుమ్ముడు మొదలైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కాలంలో వివాదాల పాలైన సినిమాలు అన్నీ దాదాపుగా బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుంటున్నాయి. ఇక భారీ హైప్ ఉన్న సినిమాలకు ఈ వివాదాలు తోడైతే బాక్సాఫీసును కుమ్మేయడం ఖాయం. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో ఇలాంటి పరిణామాలే చోటే చేసుకుంటున్నాయి.

'అర్జున్ రెడ్డి' సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండే కాంట్రవర్సీలు. హీరో హీరోయిన్ ముద్దు సీన్ ప్రాక్టీస్ చేస్తున్న పుటేజీ లీక్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. ఇక ఆపై టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ వినూత్నంగా వదులుతూ హైప్ భారీగా పెంచారు.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

‘అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో ఊహించిన దానికంటే ఎక్కువే హైప్ వచ్చింది. ‘పెళ్లి చూపులు' సినిమా ద్వారా విజయ్ దేవరకొండ దక్కించుకున్న గుర్తింపో? లేక ‘అర్జున్ రెడ్డి' టీజర్, ట్రైలర్ ఎఫెక్టో తెలియదు కానీ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

కాంట్రవర్సీలు బాగా కలిసొచ్చాయి

కాంట్రవర్సీలు బాగా కలిసొచ్చాయి

భారీ అంచనాలతో వస్తున్న సినిమాలకు... కాంట్రవర్సీలు తోడైతే మరింత లాభం. ‘అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో అలాంటివే జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేత వి. హనుమంతరావు అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్లు చించడం మీడియాలో బాగా హైలెట్ అయింది.

విజయ్ దేవరకొండ రిప్లై సూపర్

విజయ్ దేవరకొండ రిప్లై సూపర్

వి. హనుమంతరావు చేసిన పనికి.... ‘తాతయ్యా చిల్' అంటూ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్లో కామెంట్ చేయడం యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చింది.

విజయ్ వివాదాస్పద ప్రసంగం

విజయ్ వివాదాస్పద ప్రసంగం

ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో కూడా విజయ్ దేవరకొండ వివాదాస్పద ప్రసంగం చేశారు. సెన్సార్ బోర్డుపై విమర్శలు చేశారు. తనకు నీతులు చెప్పిన వారిపై, విమర్శలు చేసిన వారిపై F**K అంటూ బూతులు ప్రయోగించారు. విజయ్ ప్రవర్తన కూడా సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

బాక్సాఫీసు కుమ్ముడు మొదలైంది

బాక్సాఫీసు కుమ్ముడు మొదలైంది

అర్జున్ రెడ్డి సినిమా విడుదల ముందే బాక్సాఫసీసు వద్ద కుమ్మేస్తోంది. సినిమా రిలీజ్ ముందు రోజు రాత్రి హైదరాబాద్‌లో 57 షోలో వేస్తున్నారు. ఈ టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా చోట్ల ఇలాంటి షోలు వేస్తున్నారు. బాక్సాఫీసు వద్ద కుమ్ముడు మొదలైంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి?

రామ్ గోపాల్ వర్మ హీట్ పెంచాడు

‘అర్జున్ రెడ్డి' విషయంలో జరుగుతున్న ఈ రచ్చకు రామ్ గోపాల్ వర్మ కూడా తోడయ్యాడు. ఆర్టీసీ బస్సులపై ఉన్న 'అర్జున్ రెడ్డి' సినిమా ముద్దు పోస్టర్లు చించేసిన హనుమంతరావు దుస్తులు చించెయ్యాలని వర్మ హీరో విజయ్ దేవరకొండకు సూచించారు.

విహెచ్ ఈర్ష్య పడుతున్నాడు

అంత అందమైన అమ్మాయి జీవితంలో ఎప్పుడూ తనను ముద్దు పెట్టుకోలేదని హనుమంతరావు ఈర్ష్యపడుతున్నారా? అని వర్మ ఎద్దేవా చేశారు.

ఏంటి తాతయ్యా ఇది

తాతయ్య వయస్సులో ఉండి ఇలాంటి చిన్నపిల్లల చేష్టలేంటీ? అని వర్మ ప్రశ్నించారు. ఈ పోస్టర్లో తప్పేముందో.. మనవలు, మనవరాళ్లను ఈ తాతయ్య అడిగితే బాగుంటుందని సూచించారు.

వీహెచ్ తాతయ్యా... మీకు ఇది గుర్తించాలి

తాతయ్య వీహెచ్, డబుల్ తాతయ్య అయిన అతని పార్టీకి ఇప్పటి మనవలు, మనవరాళ్లు ఓటు వేయరంటూ వ్యాఖ్యానించారు.

అయినా నీకేం తెలుస్తాతాయి

అంతేగాక, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన హనుమంతరావుకు ఇలాంటివాటి గురించి ఏం తెలుస్తాయని ఎద్దేవా చేశారు. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ హితవు వర్మ పలికారు.

పోస్టర్ల వివాదంపై వెనకడుగు

పోస్టర్ల వివాదంపై వెనకడుగు

ఓ వైపు వీహెచ్ ఆగ్రహం,. అనంతరం రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్య కాంట్రవర్సీ ఓ వైపు ఉంటే. ముద్దు పోస్టర్లపై మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లిప్ లాక్ లకు సంబంధించిన పోస్టర్లను ఉపసంహరించుకున్నట్టు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా తెలిపారు.

మహిళలపై గౌరవం ఉంది

మహిళలపై గౌరవం ఉంది

మహిళలను గౌరవిస్తూ ఏపీ, తెలంగాణాల్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా పోస్టర్లను తీసేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘అర్జున్ రెడ్డి' సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

English summary
Arjun Reddy movie Kiss Posters removed Telugu States. Mahila sanghas have demanded to remove the kissing posters of the film from the public places.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu