»   » రిస్క్ అంటున్నారు, కొడుకుతో అర్జున్ రెడ్డి రీమేక్: దర్శకుడు "బాలా" సిద్దమైపోయాడు

రిస్క్ అంటున్నారు, కొడుకుతో అర్జున్ రెడ్డి రీమేక్: దర్శకుడు "బాలా" సిద్దమైపోయాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వ వ‌హించిన ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది..విజ‌య్, హీరోయిన్ షాలిని పాండేలు ఈ మూవీలో చ‌క్క‌గా న‌టించి క్రేజీ స్టార్స్ గా మారిపోయారు.ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా ఇంతగా కలెక్షన్లను కురిపించిందంటే ఒక్కసారిగా టాలీవుడ్ మొత్తం షాక్ కు గురైంది. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమా చూసి హీరో విజయ్ పైన, దర్శకుడు సందీప్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా బోల్డ్ గా, రియాలిటీ కి చాలా దగ్గరగా ఉందంటూ విడుదలైన మొదటి రోజు నుండే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ ని రాబట్టింది.

ఈ-4 ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థ

ఈ-4 ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థ

ఇప్ప‌డు ఈ మూవీని మ‌ల‌యాళం, త‌మిళంలో రీమేక్ చేస్తున్నారు.. విజ‌య దేవ‌ర‌కొండ చేసిన పాత్ర‌ను తమిళంలో స్టార్ హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ చేయ‌నున్నాడు. కోలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ ను "ఈ-4 ఎంటర్ టైన్ మెంట్స్" అనే సంస్థ దక్కించుకుంది. అయితే తాజాగా తమిళంలో హీరోని ప్రకటించింది.


 విక్రమ్ కొడుకును హీరోగా

విక్రమ్ కొడుకును హీరోగా

ఇప్పటికే తమిళంలో ఆర్యని హీరోగా అనుకున్నారు. కానీ కొత్త హీరో ఎవరైనా చేస్తే బాగుంటుందని ఆలోచించింది నిర్మాణ సంస్థ.ఈ విషయం గురించి హీరో విక్రమ్ ని సంప్రదించారు. ఇప్పటికే విక్రమ్ తన కొడుకును హీరోగా పరిచయం చేయాలనుకుంటున్నాని ప్రకటించిన విషయం తెలిసిందే.


గుడ్ నైట్ చార్లీ

గుడ్ నైట్ చార్లీ

సినిమా రంగంతో ధృవ్ కు ఇప్పటికే అనుబంధం ఏర్పడింది. విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమాకు తెరవెనక వర్క్ చేసిన ధృవ్.. తనే సొంతంగా గుడ్ నైట్ చార్లీ అనే షార్ట్ ఫిలిం కూడా తీశాడు. ఇక అర్జున్ రెడ్డి గురించి చెప్పగానే విక్రమ్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.


 విఘ్నేష్ శివన్

విఘ్నేష్ శివన్

తన తనయుడు హీరోగా అరంగేట్రం చేయడానికి ఇదే సరైన సినిమా అని ఆయన భావిస్తున్నారు. అందుకే తన తనయుడి ఎంట్రీ ఈ రీమేక్ తో జరుగనుందని ఆయన స్వయంగా ప్రకటించారు. దర్శకుడు బాలా ‘అర్జున్ రెడ్డి' రీమేక్‌కు దర్శకత్వం వహించబోతున్నాడట.


English summary
Arjun Reddy which was a runaway hit in Telugu is being remade in Tamil with Chiyaan Vikram's son Dhruv reprising Vijay Devarkonda's role. While there was much speculation about who will helm the Tamil version, it has now been confirmed that ace director Bala will be calling the shots.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu