‘అర్జున్ రెడ్డి’... కాపీ కొట్టి తీశారా? దర్శక నిర్మాతలకు నోటీసులు
‘అర్జున్ రెడ్డి’ మూవీ కాపీ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్ర కథ తనదే అంటూ నాగారాజు ఆరోపిస్తున్నారు.
Recommended Video

ఓ వైపు సూపర్ హిట్ టాక్, బ్లాక్ బస్టర్, ట్రెండ్ సెట్టర్ అనే ప్రశంసలు...... మరో వైపు ఈ సినిమా యువతను చెడగొట్టే విధంగా ఉంది, బూతులున్నాయి, సినిమాను నిలిపి వేయాలంటూ విమర్శలు. ఇదీ తాజాగా బాక్సాఫీసు వద్ద సూపర్ కెలక్షన్లతో దూసుకెలుతున్న 'అర్జున్ రెడ్డి' మూవీ పరిస్థితి.
తాజాగా ఈ చిత్రం కాపీ వివాదంలో ఇరుక్కుంది. ఈ చిత్ర కథ తనదేనంటూ ఖమ్మంకు చెందిన దర్శకుడు డి.నాగరాజు ఆరోపించారు. ఈ మేరకు ఆయన దర్శక నిర్మాతలకు నోటీసులు పంపారు. తనకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.

డి. నాగరాజు ఎవరు?
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన డి.నాగరాజు అనే దర్శకుడు గతంలో 'ఇక సె..లవ్' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఆధారంగానే ‘అర్జున్ రెడ్డి' సినిమా తీశారని ఆయన ఆరోపిస్తున్నారు.

నష్టపరిహారం ఇవ్వాల్సిందే
తన కథను వాడుకున్నందుకుగాను తనకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని, పరిహారంగా రూ. 2 కోట్లు చెల్లించాలని నాగరాజు డిమాండ్ చేస్తున్నారు.

న్యాయం జరిగే వరకు
ఈ కథ కాపీ కొట్టిన విషయమై ఇప్పటికే దర్శక నిర్మాతలకు తాను నోటీసులు పంపానని, తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని డి. నాగరాజు స్పష్టం చేశారు.

ఇదీ సందీప్ రెడ్డి వెర్షన్
అయితే ‘అర్జున్ రెడ్డి' సినిమా దర్శకుడు మాత్రం ఈ సినిమా కథను తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా తయారుచేసుకున్నానని ముందు నుండీ చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి ఈ కాపీ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











