For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Arjun Sarja Vishwak Sen: చంద్రబోస్ పాటలు నచ్చలేదన్నాడు, గౌరవం లేదు.. విశ్వక్ సేన్ పై అర్జున్ సీరియస్

  |

  వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్ సేన్ ఫలక్ నూమా దాస్ సినిమాతో మాస్ కా దాస్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల ఓరి దేవుడా సినిమాతో అలరించిన ఈ హీరో తరచూ వివాదాల పాలవుతుంటాడని తెలిసిందే. ఓ ప్రాంక్ వీడియోతో కాంట్రవర్సీ ఎదుర్కొన్న విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు.

  యాక్టర్ అండ్ డైరెక్టర్ అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కి అగ్రిమెంట్ ప్రకారం విశ్వక్ సేన్ రాకుండా హ్యాండ్ ఇచ్చాడని, కాల్స్ కి స్పందించడం లేదని తాజాగా అర్జున్ సర్జా ఫైర్ అయ్యాడు. ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ సేన్ ప్రవర్తనపై కామెంట్లు చేశాడు. ఆ వివరాళ్లోకి వెళితే..

  కుమార్తెను తెలుగు తెరకు పరిచయం చేస్తూ..

  కుమార్తెను తెలుగు తెరకు పరిచయం చేస్తూ..

  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన సత్తా చాటారు. ఇటీవల రవితేజ ఖిలాడీ సినిమాలో పోలీస్ ఆపీసర్ గా అలరించారు. తాజాగా ఆయన డైరెక్టర్ గా చేస్తున్న 17వ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటించంగా హీరోయిన్ గా ఆయన కుమార్తే ఐశ్వర్యను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకు పవర స్టార్ పవన్ కల్యాణ్ ముహుర్తం క్లాప్ కొట్టి ప్రారంభించారు.

  రెండు సార్లు క్యాన్సిల్ చేశాం..

  రెండు సార్లు క్యాన్సిల్ చేశాం..

  తాజాగా ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి అర్జున్ సర్జా ప్రెస్ మీట్ లో తెలిపారు. "కథ నేరేట్ చేసినప్పుడు విశ్వక్ సేన్ పిచ్చిపిచ్చిగా నచ్చిందన్నాడు. ఆ తర్వాత అతన్ని షూటింగ్ రమ్మని చెబితే సరైనా సమయానికి రాలేదు. అతని వల్ల రెండు సార్లు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కథ నేరేట్ చేశాకు విశ్వక్ సేన్ ఒక రెమ్యునరేషన్ చెప్పాడు.

  అన్ని ఫోన్ కాల్స్ ఎవరికీ చేయలేదు..

  అన్ని ఫోన్ కాల్స్ ఎవరికీ చేయలేదు..

  నేను అంతా ఇచ్చుకోలేనని చెప్పాను. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ఓ ఏరియా రైట్స్ ఇవ్వమని అడిగితే సరే అన్నా. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత స్టోరి డిస్కషన్స్ కోసం ఎన్నిసార్లు పిలిచినా లిఫ్ట్ చేయలేదు. కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్ ని పంపిద్దామని ఫోన్స్ చేసినా అటెండ్ చేయలేదు. నా జీవితంలో అన్ని ఫోన్ కాల్స్ ఎవరికీ చేయలేదు. నేను కానీ, నా టీమ్ గానీ ఎలాంటి తప్పు చేయలేదు.

  ఫ్రొఫెషనలిజం లేదు..

  ఫ్రొఫెషనలిజం లేదు..

  విశ్వక్ సేన్ కు ఫ్రొఫెషనలిజం లేదు. దర్శకనిర్మాతలు అంటే అసలు గౌరవమే లేదు. నేనొక దర్శకుడిగా, నిర్మాతగా హర్ట్ అయ్యాను. ఒకసారి విదేశాలకు వెళ్లి వచ్చానని, స్కిన్ ట్యాన్ అవ్వడంతో కొంత రెస్ట్ తీసుకుని ఫ్రెష్ గా సెట్ కు వస్తానంటే ఓకే అన్నాం. షెడ్యూల్ క్యాన్సిల్ చేశాం. ఆ తర్వాత మరోసారి కొత్త షెడ్యూల్ చెబితే.. తెల్లవారితో షూటింగ్ అనగా ఉదయం నాలుగు గంటలకు క్యాన్సిల్ చేయమని విశ్వక్ నుంచి మెసేజ్ వచ్చింది.

  ఎప్పటికీ విశ్వక్ తో సినిమా చేయను..

  ఎప్పటికీ విశ్వక్ తో సినిమా చేయను..

  పని పట్ల విశ్వక్ సేన్ కు కమిట్ మెంట్ లేదు. నాకు వంద కోట్లు వస్తాయని చెప్పినా ఎప్పటికీ విశ్వక్ తో సినిమా చేయను. డైరెక్టర్ గా నాకు ఒక విజన్ ఉంటుంది. టాప్ రైటర్ సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్ లు, చంద్రబోస్ రాసిన పాటలు నచ్చలేదని మధ్యలో ఇబ్బంది పెట్టాడు. అతని ప్రవర్తన ఏమాత్రం బాలేదు. ప్రొడ్యూసర్ గిల్డ్, నిర్మాతల మండలిలో విశ్వక్ గురించి కంప్లేంట్ చేస్తున్నాం. నాకు జరిగినట్లు మరొకరికి జరగకూడదని కోరుకుంటున్నా. నాది మంచి కథ. త్వరలో మరొక హీరోతో సినిమా తీస్తాను" అని అర్జున్ సర్జా పేర్కొన్నారు.

  English summary
  Actor And Director Arjun Sarja Serious On Vishwak Sen Behaviour Over Working With His Movie And Arjun Going To File Complaint Against Vishwak Sen In Film Chamber.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X