»   » నలభీముడిగా నారా రోహిత్.. చేపల కూర వండిన హీరో..

నలభీముడిగా నారా రోహిత్.. చేపల కూర వండిన హీరో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో నారా రోహిత్ నలభీముడిగా మారాడు. ఇటీవల సినిమా సెట్లో పూదీనా బిర్యాని చేసి చిత్ర యూనిట్ ఆశ్చర్యంలో ముంచెత్తిన నారా వారి అబ్బాయి.. మరోసారి తన పాకశాస్త్రంలో ప్రావీణ్యాన్ని బయటపెట్టుకొన్నాడు. వంట వండుతుండగా తీసిన అప్పటి ఫోటోను నటుడు సుధీర్‌బాబు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. బిర్యానీ కమ్మగా ఉంది అని కామెంట్ పెట్టాడు.

Arjun suicide attempt after murdered his two children

శమంతకమణి షూటింగ్‌లో తాజాగా నారా రోహిత్ చేపల కూర వండారు. చిత్ర యూనిట్ రుచికరమైన చేపల కూరను రుచి చూపించారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ భవ్యా క్రియేషన్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. 'మా ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ కుమార్‌ 'శమంతకమణి' సినిమా సెట్‌లో రుచికరమైన చేపల కూర వండారు' అని పేర్కొంది.


Arjun suicide attempt after murdered his two children

'శమంతకమణి'లో నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌ కిషన్‌, ఆది ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో నారా రోహిత్‌ ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ కుమార్‌ పాత్ర పోషిస్తున్నారు. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.


English summary
Hero Nara Rohith surprises Shamantakamani film unit. He prepared fish curry for film unit. This movie is getting ready under Bhavya creations banner. V Anand Prasad is director for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu