»   » తెలుగులో 'వీరప్పన్‌' జీవిత చరిత్ర...డిటేల్స్

తెలుగులో 'వీరప్పన్‌' జీవిత చరిత్ర...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అర్జున్‌, లక్ష్మీరాయ్‌ జంటగా నటించిన అనువాద చిత్రం 'వీరప్పన్‌'. కిషోర్‌ కీ రోల్ పోషించారు. గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఎ.యమ్‌.ఆర్‌.రమేష్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

దర్శక, నిర్మాత మాట్లాడుతూ ''వాస్తవానికి అద్దం పట్టే చిత్రమిది. వీరప్పన్‌ జీవితాన్ని యధాతథంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాం. ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రం చక్కటి ఆదరణ పొందింది. తెలుగులోనూ అదే తరహాలో ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకముంది. వీరప్పన్‌ బంధువుల్ని, స్నేహితుల్ని కలిసి వారి నుంచి సేకరించిన సమాచారంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. వీరప్పన్‌ ప్రస్థానం ఎలా మొదలైంది? అడవి నుంచి ఎలా బయటికి రప్పించారు?ఆతన్ని ఎలా ఎన్‌కౌంటర్‌ చేశారు? అనే విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి'' అన్నారు.

Arjun in Veerappan biopic

ఈ చిత్రం విడుదలపై గం ధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కోర్టు వనయుద్ధం చిత్రంపై తాత్కాలిక స్టేను విధించింది. ఈ తీర్పు ను వ్యతిరేకిస్తూ చిత్ర దర్శక నిర్మాత హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇందులో ఆయన తరపు న్యాయవాది ఎ.నటరాజన్ హాజరై వీరప్పన్ గురించి ప్రచారమైన వార్తలను ఇతివృత్తంగా తీసుకుని 'వీరప్పన్‌' ( కన్నడ వనయుద్ధం) చిత్రాన్ని తెరకెక్కించామని పేర్కొన్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకొన్నాయి. ఈ నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. రవికాలే, సురేష్‌ ఒబెరాయ్‌, సుచేంద్రప్రసాద్‌, సంపత్‌రామ్‌, జయబాలన్‌ తదితరులు నటించారు.

English summary
Action king Arjun is being done in the role of a police officer Vijayakumar who nabbed the forest brigand Veerappan. Another actor Kishore is playing the character of Veerappan and whereas dusky beauty Priyamani is being played as Muthulakshmi, wife of Veerappan. Yesteryear hero-ine jayachitra is playing as CM Jayalalitha. This is directed by AMR Ramesh.
Please Wait while comments are loading...