»   » బాహుబలి : ఫ్రాడ్ ఈమేల్స్‌పై ఆర్కా మీడియా వివరణ

బాహుబలి : ఫ్రాడ్ ఈమేల్స్‌పై ఆర్కా మీడియా వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఆ మధ్య 'బాహుబలి' చిత్రం కోసం ఆడిషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎక్కువ మంది నటీనటులు అవసరం కావడంతో ఆడిషన్స్ నిర్వహించారు. కొందరిని ఆ మధ్య ఎంపిక చేసారు కూడా. అయితే ఈ నెలలో మళ్లీ ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు కొందరికి ఈమెయిల్స్ వెళ్లాయి.

దీంతో 'బాహుబలి' చిత్రాన్నినిర్మిస్తున్న ఆర్కామీడియా రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకుంది. ఈ నెలలో ఎలాంటి ఆడిషన్స్ నిర్వహించడం లేదని, అసలు ఇప్పుడు అలాంటి ఆలోచన కూడా లేదని, అవన్నీ ఫ్రాడ్ ఈమెయిల్స్ అంటూ స్పష్టం చేసారు సంస్థ నిర్వాహకులు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా అతనికి జోడీగా అనుష్క నటిస్తోంది. రాణా విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్నాడు రాజమౌళి.

ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ 'బాహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా తమిళ నటుడు సత్యరాజ్ కబ్బా అనే పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమారాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. జూన్ నెలలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

English summary
"It has come to our notice that emails have been sent claiming to be from Arka Mediaworks asking people to attend auditions for Baahubali. These emails are fraud. Please note that we have not invited anyone for auditions this month and are not conducting any auditions right now" Arka Mediaworks Clarified.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu