»   » 100 కోట్లుకు కేవలం 36 డేట్సేనా... 50 కావాలన్న శంకర్!

100 కోట్లుకు కేవలం 36 డేట్సేనా... 50 కావాలన్న శంకర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు శంకర్ గానీ, సూపర్ స్టార్ రజనీ కానీ ఇప్పటివరకూ ఒక్క ముక్క కూడా రోబో 2 గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. అయినా వార్తలు మాత్రం ఆగటం లేదు. అఫిషీయల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేలోగా ఈ చిత్రం గురించి వచ్చే వార్తలతో ఓ పుస్తకం వేసేయచ్చు అని సినీ వర్గాల్లో వినపడుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా రజనీకు ఆపోజిట్ గా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్నాల్డ్ ఈ ప్రాజెక్టు ఓకే చేయటానికి కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం.

ఈ కండిషన్స్ లో ముఖ్యంగా వంద కోట్ల రూపాయలు ఆయన రెమ్యునేషన్ గా అడిగినట్లు సమాచారం. బడ్జెట్ 300 వందల కోట్లు అనుకుంటున్న ఈ చిత్రంలో ఆయన నటిస్తే అది హాలీవుడ్ ప్రాజెక్టు అవుతుందనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో ఆయనతో కంటిన్యూగా లైకా ప్రొడక్షన్స్ వారు చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

Arnold Schwarzenegger Demanding 100 Cr For Robo 2?

ఇంత రెమ్యున‌రేష‌న్ తీసుకుని అడిగిన‌న్ని రోజులు కాల్షీట్ మాత్రం ఇవ్వ‌డం లేద‌ట ఆర్నాల్డ్‌. 50రోజుల‌పాటు కాల్షీట్ అడిగితే త‌ను 32 రోజుల కాల్షీట్‌ను మాత్ర‌మే ఇచ్చాడ‌ట‌. అందుకు శంక‌ర్ ఒప్పుకోలేద‌ట‌. నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌ల అనంతరం ఆర్నాల్డ్ 36రోజుల కాల్షీట్ ఇస్తానన్న‌డ‌ట‌. ఆర్నాల్డ్ ను ఒప్పించేందుకు, 50 రోజుల డేట్స్ తీసుకునేందుకు శంకర్ స్వయంగా రంగంలోకి దిగాడని, అమెరికా వెలుతున్నట్లు టాక్.

ఇందులో హీరోకి దీటైన పాత్ర కావడంతో ఆర్నాల్డ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఆయన నటిస్తున్నారా? లేదా? అన్న విషయం స్పష్టం కాలేదు. కానీ ఆర్నాల్డ్‌ ఒప్పుకొన్నట్లు కూడా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రజనీ చేస్తున్న 'కబాలి' చిత్రీకరణ కొలిక్కి వచ్చాకే దీనిపై శంకర్‌ ప్రకటన చేసే అవకాశముంది.

English summary
Film Nagar source said that, Arnold Schwarzenegger Demanding 100 Cr For Shankar's Robo 2.
Please Wait while comments are loading...