twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శంకర్ ‘రోబో-2’: హాలీవుడ్ ఆర్నాల్డ్‌తో కొత్త తలనొప్పి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దర్శకుడు శంకర్ గానీ, సూపర్ స్టార్ రజనీ కానీ ఇప్పటివరకూ ఒక్క ముక్క కూడా రోబో 2 గురించి అఫీషియల్ గా మాట్లాడలేదు. అయినా వార్తలు మాత్రం ఆగటం లేదు. అఫిషీయల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేలోగా ఈ చిత్రం గురించి వచ్చే వార్తలతో ఓ పుస్తకం వేసేయచ్చు అని సినీ వర్గాల్లో వినపడుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్ గా రజనీకు ఆపోజిట్ గా హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్నాల్డ్ ఈ ప్రాజెక్టు ఓకే చేయటానికి కొన్ని కండీషన్స్ పెట్టినట్లు సమాచారం.

    ఈ కండిషన్స్ లో ముఖ్యంగా వంద కోట్ల రూపాయలు ఆయన రెమ్యునేషన్ గా అడిగినట్లు సమాచారం. తాజాగా స్క్రిప్టు కూడా చేంజ్ చేయాలని కొత్త తలనొప్పి తెచ్చి పెట్టాడట. ఇందుకోసం హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటర్ల సహాయం తీసుకోవాలని, అప్పుడే తాను ఈ సినిమాలో నటిస్తానని అంటున్నాడట ఆర్నాల్డ్.

    Arnold Schwarzenegger Demands A Change Of Script To Act In Enthiran 2?

    బడ్జెట్ 300 వందల కోట్లు అనుకుంటున్న ఈ చిత్రంలో ఆయన నటిస్తే అది హాలీవుడ్ ప్రాజెక్టు అవుతుందనటంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో ఆయనతో కంటిన్యూగా లైకా ప్రొడక్షన్స్ వారు చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

    ఇంత రెమ్యున‌రేష‌న్ తీసుకుని అడిగిన‌న్ని రోజులు కాల్షీట్ మాత్రం ఇవ్వ‌డం లేద‌ట ఆర్నాల్డ్‌. 50రోజుల‌పాటు కాల్షీట్ అడిగితే త‌ను 32 రోజుల కాల్షీట్‌ను మాత్ర‌మే ఇచ్చాడ‌ట‌. అందుకు శంక‌ర్ ఒప్పుకోలేద‌ట‌. నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌ల అనంతరం ఆర్నాల్డ్ 36రోజుల కాల్షీట్ ఇస్తానన్న‌డ‌ట‌. ఆర్నాల్డ్ ను ఒప్పించేందుకు, 50 రోజుల డేట్స్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడట.

    ఇందులో హీరోకి దీటైన పాత్ర కావడంతో ఆర్నాల్డ్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఆయన నటిస్తున్నారా? లేదా? అన్న విషయం స్పష్టం కాలేదు. కానీ ఆర్నాల్డ్‌ ఒప్పుకొన్నట్లు కూడా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రజనీ చేస్తున్న 'కబాలి' చిత్రీకరణ కొలిక్కి వచ్చాకే దీనిపై శంకర్‌ ప్రకటన చేసే అవకాశముంది.

    English summary
    Though the participation of Hollywood actor Arnold Schwarzenegger, in the upcoming science-fiction Enthiran 2, has not yet been made official, reports regarding the Terminator actor's involvement in the high budget project continues to flow in. First, it was Arnold's 100 Crore rupees remuneration in order to take part in the film and now an urge to rewrite the entire script of Enthiran 2 with the help of Hollywood scriptwriters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X