రేయ్ మోహన్ బాబు రా రా.. నీ అబ్బా అంటూ.. మహిళ నటి బండబూతులు.. మా ప్రమాణ స్వీకారం వద్ద గందరగోళం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గం ప్రమాణ స్వీకారం సమయంలో నటి శ్రీనిజా నాయుడు హల్‌చల్ చేశారు. మోహన్ బాబు కుటుంబాన్ని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. మా అధ్యక్ష పదవిలో ఉండటానికి విష్ణు మంచుకు అర్హత లేదు అంటూ ఆమె మీడియా ముందు పరుషంగా మాట్లాడారు. ఏపీ రాజకీయాల కంపును సినిమా పరిశ్రమకు అంటగట్టేందుకు ప్రయత్నం చేశారు అంటూ నటి శ్రీనిజా మీడియా ముందు మోహన్ బాబును బూతులు తిట్టారు. నటి శ్రీనిజ మీడియాతో మాట్లాడుతూ...

ముండ మోపి అంటావా?

ముండ మోపి అంటావా?

మా మాజీ అధ్యక్షుడు వీకే నరేష్ చేసిన పనులను పక్కన పెడితే.. ఆయన జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులందరికి సరైన సూచనలు, సలహాలు ఇస్తే బాగుండేది. ఒక వ్యక్తి పేరు ప్రపోజ్ చేస్తే.. ఆయన వ్యక్తిగత జీవితంలోకి దూరి, ఆస్తులు, అప్పులు, భార్య, పిల్లల విషయాల్లోకి దూరిపోయి నరేష్ తన చేతకాని తనాన్ని బయటపెట్టుకొన్నారు. వీకే నరేష్ చేసిన అవకతవకలను బయటపెట్టి కన్నీళ్లు పెట్టుకొంటే వారిని ఆయన ముండమోపి అంటూ కామెంట్ చేస్తారు. భర్త చనిపోయిన వాళ్లను కించపరిచే విధంగా నరేష్ మాట్లాడటం చాలా పెద్ద తప్పు అని శ్రీనిజ ఘాటుగా స్పందించారు.

వైఎస్ జగన్ కాళ్లు పట్టుకొని

వైఎస్ జగన్ కాళ్లు పట్టుకొని


చెన్నై నుంచి పరిశ్రమ తరలి వచ్చిన తర్వాత మహిళా నటీనటులకు ఏం భరోసా ఇచ్చారు. గతంలో మోహన్ బాబు అధ్యక్షుడిగా ఉండి ఏం చేశారు. ఇప్పుడు విష్ణు మంచు వచ్చి ఏం చేస్తారు? అని నటి శ్రీనిజ ప్రశ్నించారు. మా ఎన్నికలకు ముందు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాళ్లు, వేళ్లు పట్టుకొన్నారు. పవన్ కల్యాణ్ నుంచి ఎలాంటి ఒత్తిడి రాకుండా చూసుకొంటామని చెప్పిన తిమింగళం. పవన్ కల్యాణ్‌ను అడ్డుకొంటామని చెప్పి.. మా అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించేలా సహకరించమని కోరారు అని నటి శ్రీనిజ ఆరోపించారు.

నేను సంతాప సభ పెట్టకపోతే..

నేను సంతాప సభ పెట్టకపోతే..


మా అధ్యక్ష పీఠం నుంచి వెళ్లిపోకపోతే మోహన్ బాబు, మంచు విష్ణు, అలాగే ఆయనకు భజన చేసే 30 మందికి సంతాప సభ పెట్టకపోతే.. నా పేరు శ్రీనిజ నాయుడే కాదు అని అన్నారు. ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు ఇంటికి పట్టుకెళ్తారా? బ్యాలెట్ బాక్సులంటే బొమ్మలాటగా ఉందా? రోడ్డు మీద అమ్మాయిలు కనిపిస్తే లాక్కెళ్లినట్టు అనుకొంటున్నారా? అని శ్రీనిజ నాయుడు ఘాటుగా స్పందించారు.

అపరకాళిలా వచ్చానంటూ...

అపరకాళిలా వచ్చానంటూ...

విష్ణు మంచు ప్రమాణ స్వీకారం వేదిక వద్దకు వెళ్లి.. ఓరేయ్ మోహన్ బాబు.. అపరకాళిలా వచ్చాను. రారా ఛాలెంజ్ చేస్తున్నా.. ఆడవాళ్లంటే గౌరవం లేదా? ఎవరైనా ప్రశ్నిస్తే.. నీ అబ్బా.. నీ అబ్బా అని తిడుతావా? నా సంగతి ఏమిటో చూసిస్తాను. నేను నికార్సైన ఆంధ్రా ఆడదాన్ని. ఇలాంటి విషయాలను మీడియా ప్రజలకు చెప్పాలని సూచించారు. పవన్ కల్యాణ్‌ను రాజకీయాల్లో ఎదుర్కోలేక.. మాలో రాజకీయాలు చేస్తున్నారు అంటూ నటి శ్రీనిజ చెప్పారు.

జీవితా రాజశేఖర్‌పై కోపంగా

జీవితా రాజశేఖర్‌పై కోపంగా


మా ఎన్నికల్లో జీవిత గెలిచిన తర్వాత రాజశేఖర్‌ను కొడుతానన్నాడు. కానీ వారి జీవితాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అని మీడియాతో మాట్లాడుతుంటే.. పోలీసులు ఆమెను అడ్డుకొన్నారు. న్యూసెన్స్ చేస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రమాణ స్వీకారం జరిగిన వేదిక వద్ద నటి శ్రీనిజ హంగామా చేయడంతో కొంత గందరగోళం నెలకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X