»   » 'అరుంధతి' హిందీ వెర్షన్ ఈ వారమే విడుదల

'అరుంధతి' హిందీ వెర్షన్ ఈ వారమే విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో ఘన విజయం సాధించిన అరుంధతి చిత్రం ఈ వారమే హిందీలో విడుదల అవుతోంది. అయితే రీమేక్ వెర్షన్ కాదు...డబ్బింగ్ వెర్షన్ కావటం విశేషం. చాలా కాలం పాటు ఈ చిత్రం రీమేక్‌ చేస్తారని అనుకున్నారు. అయితే అనుకున్నట్లుగా వర్కవుట్ కాకపోవటంతో చివరకి డైరక్ట్ గా...డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. హిందీలోనూ అదే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ వారమే విడుదల అవుతున్నట్లు న్యూస్ పేపర్లలో వచ్చింది.

ఇక మొదట ఈ చిత్రం హిందీ వెర్షన్ కు గానూ అరుంధతిగా అనూష్క ప్లేసులో అసిన్‌, ఐశ్వర్య రాయ్‌, విద్యాబాలన్‌ పేర్లు వినిపించాయి. అందులోనూ సౌత్‌ రీమేక్‌లు హిందీలో బాగా వర్కవుట్‌ అవటంతో వెంటనే ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని చెప్పారు. మరో ప్రక్క జెమినీ ఫిల్మ్‌ సర్క్యూట్‌ వారు ఈ చిత్రాన్ని భారీ రేటు ఇచ్చి సొంతం చేసుకున్నారని వినపడింది. అలాగే ఈ చిత్రం రైట్స్‌ కోసం బోనీకపూర్‌ చివరి వరకూ పోటీపడ్డారని చెప్పారు. ఈ చిత్రం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో విజయం సాధించటం పరిగణనలోకి తీసుకునే హిందీలో డబ్బింగ్ ప్లాన్‌ చేస్తున్నారు.

మరో ప్రక్క త్వరలో 'అరుంధతి' సినిమాను ప్రేరణగా తీసుకొని ఓ సరికొత్త కథాంశంతో ప్రభుదేవా ఈ సినిమా చేయనున్నారని సమాచారం. బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రను సోనాక్షి సిన్హా పోషిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుదేవా దర్శకత్వంలో సోనాక్షి 'రౌడీ రాథోడ్' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ఆమె మరోసారి ప్రభుదేవాతో చేయాలని ఉత్సాహపడుతోంది. అంతేగాక త్వరలో రిలీజవుతున్న అక్షయ్‌కుమార్ 'ఓ మై గాడ్' సినిమా కోసం ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఓ ఐటం సాంగ్ లో కూడా నర్తించారు సోనాక్షి.

ప్రస్తుతం తన వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్న సోనాక్షికి ఇటీవలే ప్రభుదేవా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారట. దాంతో ఈ పాత్రను సోనాక్షి కూడా ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నారని సమాచారం. వంద కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఇక అరుంధతి చిత్రాన్ని హిందీలో చేయాలని చాలా కాలం నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ..ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దాంతో ఈ రకంగా అరుంధతిని ప్రేక్షకులకు చూపించాలని ప్రభుదేవా ఫిక్స్ అయ్యారు.

English summary
Arundhati will now come out in Hindi. This film made with rich visual effects went on to become a big hit in Telugu and established Anushka as a big star. This weekend this film will release in Hindi by the same name.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu