ఎవరికి? ఎవరు వేసారు? (‘బిస్కెట్’ ప్రివ్యూ)
హైదరాబాద్: అరవింద్ కృష్ణ, డింపుల్ చోపాడే, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'బిస్కెట్'. అనిల్ గొపిడ్డి దర్శకుడు. స్రవంతి, రాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరితోనెైనా, ఎక్కడెైనా పని పూర్తవ్వాలంటే బిస్కెట్ వేయాల్సిందే. హీరో పాత్ర బిస్కెట్ వేసి పనులు పూర్తిచేసే టైపు. అందుకే ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టారు. క్రైమ్ స్టోరీలో కామెడీ మేళవించిన ప్రయోగాత్మక చిత్రమిది .
అశ్విన్ (అరవింద్ కృష్ణ) కమీషన్ ఏజెంట్. అతనికి పని అవ్వడం ముఖ్యం.. అందుకు ఎలాంటి ఎత్తులైనా వేస్తాడు. ఎదుటివారిని ఎలా పడగొట్టాలో బాగా తెలుసు. అలాంటి అశ్విన్‌కే బిస్కెట్ వేశారు కొందరు. వాళ్లెవరు? ఆ తరవాత ఏమైందనేదే ఈ సినిమా కథ. దీక్ష (డింపుల్ చోపడే), రాకెట్ (తాగుబోతు రమేష్) ఈ కథకు కీలకం.

దర్శకుడు అనిల్ మాట్లాడుతూ ''రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఈ సినిమా. ప్రధమార్థం హాయిగా సాగిపోతుంది. అలీ ఎంట్రీతో ఈ కథ గమనమే మారిపోతుంది. అదెలా అనేది ఆసక్తికరంగా చెప్పాం. 3 నిమిషాల 40 సెకన్ల పతాక సన్నివేశాన్ని పింగిల్ షాట్‌లో తీశాం. 5 పాటలున్నాయి. నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకి కీలకమే. '' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ...దైనందిన జీవితంలో ఒకరికి ఒకరు బిస్కెట్ వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇదే నేపథ్యంలో క్రైమ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిచాం. ఇందులో ఎవరు ఎవరికి బిస్కెట్ వేశారు? ఎవరు బిస్కెట్ అయ్యారన్నది తెరపైన చూడాల్సిందే అన్నారు.
చిత్రం: బిస్కెట్
సంస్థ: గోదావరి ప్రొడక్షన్స్
తారాగణం: అరవింద్‌కృష్ణ, డింపుల్ చోపడే, అలీ, ఎమ్మెస్ నారాయణ, అజయ్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, భరత్, చలపతిరావు తదితరులు.
నిర్మాత: స్రవంతి, రాజ్
సంగీతం, దర్శకత్వం: అనిల్ గోపిరెడ్డి
విడుదల: బుధవారం.


Click it and Unblock the Notifications











