»   » షాకయ్యే నిజం: అరవింద్ స్వామికి ప్రమాదం, వెన్నుముకకు గాయమై పక్షవాతం వచ్చి నడవలేక....

షాకయ్యే నిజం: అరవింద్ స్వామికి ప్రమాదం, వెన్నుముకకు గాయమై పక్షవాతం వచ్చి నడవలేక....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ నటుడు అరవింద్ స్వామి అప్పట్లో హీరోగా చేసిన ప్రతి సినిమా ఓ సెన్సేషన్. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి తిరిగి తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. తమిళంలో తని ఒరువన్ సినిమాతో సూపర్ రీఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి.. తెలుగులో ధృవ సినిమాతో చెలరేగిపోయాడు. తమిళ చిత్రం 'తని ఒరువన్‌'లో సిద్ధార్థ్‌ అభిమన్యుగా స్టైలిష్‌ విలన్‌ పాత్రతో అలరించిన ఆయన ఆ సినిమా తెలుగు రీమేక్‌ 'ధృవ'లోనూ అదే పాత్ర చేశారు.

సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధృవ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి అరవింద్ స్వామి కూడా ఓ మెయిన్ రీజన్ అని చెప్పాలి. ధృవ సక్సెస్ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు.

'దళపతి', 'రోజా', 'బొంబాయి' లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారాయన. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సినిమాలకి దూరమయ్యారు. మధ్యలో 'కడలి' చిత్రంలో అతిథి పాత్రలో మెరిసినా 'ధృవ' చిత్రంతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా అరవింద్‌ స్వామి హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.

''నటుడు అన్ని రకాల పాత్రలు చేయాలి. ఎప్పుడూ మంచి వ్యక్తిగానే నటించడం నాకు నచ్చదు'' అంటూ చెప్పే అరవింద్‌ స్వామి తన జీవితంలో వచ్చిన చీకటి అధ్యాయం గురించి, దాన్ని అధిగమించిన తీరు గురించి వివరించారు.
ఆయన మాటల్లోనే వాటిని విందాం...

నడవలేకపోయాను

నడవలేకపోయాను

‘‘2006లో నాకు ఓ ప్రమాదం జరిగింది. వెన్నెముకకి గాయం అయింది. పక్షవాతం వచ్చింది. ఏడాదిపాటు నడవలేకపోయా. మళ్లీ మామూలు వ్యక్తిని కావడానికి నాలుగేళ్ల సమయం పట్టింది. '' అంటూ తన జీవితంలో తనకు వచ్చిన సమస్య గురించి అరవింద్ స్వామి వివరించారు.

వ్యతిరేకమైన ఆలోచనలు దగ్గరకు రానివ్వకూడదనే..

వ్యతిరేకమైన ఆలోచనలు దగ్గరకు రానివ్వకూడదనే..

పక్షవాతం వచ్చిన సమయంలో మానసికంగా బలంగా ఉండాలని నిర్ణయంచుకొన్నా. వ్యతిరేకమైన ఆలోచనల్ని దరి చేయనీయకుండా ఏదో ఒక పనితో బిజీ కావాలనుకొన్నా. నటుడిగా మళ్లీ ఇలా బిజీ కావడానికి కారణం కూడా అదే అంటూ తేల్చి చెప్పారు అరవింద్ స్వామి.

ప్రస్తుతం నా దృష్టంతా..

ప్రస్తుతం నా దృష్టంతా..

వచ్చే ఏడాది దర్శకత్వం చేయబోతున్నా. అలాగని నటనని వదులుకోను. దర్శకత్వం కోసం రెండు కథల్ని సిద్ధం చేసుకొన్నా. ఇటీవల ‘వనంగముడి' అనే కథ రాశా. ఒక పోలీసు పాతికేళ్ల జీవితం నేపథ్యంలో సాగే ఆ కథలో నేనే నటిస్తున్నా. అలాగే మలయాళ చిత్రం ‘భాస్కర్‌ ది రాస్కెల్‌' తమిళ రీమేక్‌లోనూ నటిస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టంతా తమిళ సినిమాలపైనే అని చెప్పారు అరవింద్ స్వామి.

కంపర్ట్ చూసుకుంటా..

కంపర్ట్ చూసుకుంటా..

నటన కన్నా నాకు క్రియేటివ్‌ వర్క్‌ మీద ఆసక్తి ఎక్కువ. 20 ఏళ్ల వయసు నుంచి డైరెక్షన చెయ్యాలనుంది. కొన్ని కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది లవ్‌, రొమాంటిక్‌ థ్రిల్లర్‌తో దర్శకుడిగా మెగా ఫోన పట్టబోతున్నా. కంఫర్ట్‌ అయిన భాషల్లో సినిమాలు చెయ్యడానికి ఎప్పుడూ వెనకాడను. కానీ ఏ పని చేసినా కంఫర్ట్‌ చూసుకుంటా అన్నారు అరవింద్ స్వామి.

చాలా ఇష్టం..

చాలా ఇష్టం..

మణిరత్నంగారితో సినిమా అంటే ఏ క్షణమైనా రెడీగా ఉంటా. ఆయన విజువలైజేషన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర చాలా మెళకువలు నేర్చుకున్నా అంటూ చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. అరవింద్ స్వామిని పరిచయం చేసింది మణిరత్నం అనే సంగతి తెలిసిందే. దళపతి సినిమా ద్వారా మణిరత్నం ...ఆయన్ని సినీ పరిశ్రమకు తెచ్చారు. ఆ తర్వాత మణి దర్శకత్వం వహించిన రోజా, ముంబై చిత్రాల్లో అరవింద్ స్వామి నటించారు.

కథ నచ్చాలి మొదట

కథ నచ్చాలి మొదట

‘‘విలన్ గా నటించాలనే కోరిక నాకు మొదట్నుంచీ ఉండేది. హాలీవుడ్‌ సినిమాల్లో అందరూ అన్ని రకాల పాత్రలూ చేస్తున్నారు. అందుకే కథ, పాత్ర నచ్చితే ఏ పాత్రలో నటించడానికైనా సిద్ధంగా ఉంటా'' అన్నారు అరవింద్ స్వామి.

ఇక్కడే ఆ పద్దతి

ఇక్కడే ఆ పద్దతి

‘‘హీరోగా పరిచయమైన వ్యక్తి హీరోగానే కొనసాగాలనే రూల్‌ ఏమీ లేదు. భారతీయ సినిమాలోనే ఈ పద్దతి ఉంది. మనదేశం దాటివెళ్తే ఎటువంటి బేధాలు లేకుండా ఇమేజ్‌ చట్రానికి దూరంగా ఉంటూ అక్కడి ఆర్టి్‌స్టలు అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తారు. నాకు నెగిటివ్‌ రోల్స్‌ అంటే ఇష్టం. హీరోగానే స్థిరపడాలని నేనెప్పుడూ అనుకోలేదు. పైగా హీరో క్యారెక్టర్లు బోర్‌ కొట్టాయి. అలాగని మంచిదైన ఏ క్యారెక్టర్‌నీ వదలను'' అని చెప్పారు అరవింద్‌స్వామి.

కసరత్తలు చేసాను

కసరత్తలు చేసాను

దర్శకుడు మోహన్‌రాజా తమిళ సినిమా ‘తని ఒరువన్‌'కి సంబంధించిన కాన్సెప్టుని మాత్రమే చెప్పారు.తర్వాత మూడు నెలలపాటు ఆయనతో కలిసి స్ర్కిప్ట్‌ వర్క్‌లో భాగమయ్యాను. సిద్ధార్థ్‌ అభిమన్యు పాత్ర కోసం కసరత్తులు చేశా. నటన కన్నా కథలో ఇనవాల్వ్‌ కావడం ఆసక్తిగా అనిపించింది. అభిమన్యు క్యారెక్టర్‌కి నేను యాప్ట్‌ అవుతానని టీమ్‌ అందరూ భావించడంతో ఆ పాత్ర చేశా అన్నారు అరవింద్ స్వామి.

ఇక్కడ అంత కష్టపడలేదు

ఇక్కడ అంత కష్టపడలేదు

మాతృకతో ఎంత పేరొచ్చిందో.. తెలుగు రీమేక్‌ ‘ధృవ'కూ అంతే పేరొచ్చింది. సురేందర్‌రెడ్డి వర్కింగ్‌ స్టైల్‌ నచ్చింది. ‘తని ఒరువన'కి కష్టపడ్డాను కాబట్టి ‘ధృవ' కోసం అంత కష్టపడలేదు. చాలాకాలం తర్వాత తెలుగుతెర మీద కనిపించి సక్సెస్‌ అందుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి.

జీవితం మొత్తం అదే

జీవితం మొత్తం అదే

‘‘సినిమాలే లోకం అని ఎప్పుడూ అనుకోలేదు. వయసులో ఉన్నప్పుడు వేరే ఆలోచనలు లేకుండా సినిమాలు చేయడం మొదలు పెడితే జీవితం మొత్తం అదే చేయాల్సి ఉంటుంది. అందుకే స్టార్‌డమ్‌ని ఆస్వాదిస్తూ గడపడం కంటే జీవితంలో మరికొన్ని పనులు చేయాలనే భావన మనసులో ఉండేది. మధ్యలో విరామం తీసుకొని వ్యాపారంవైపు దృష్టి పెట్టడానికి కారణం అదే. అంతర్జాతీయ స్థాయిలో పలు వ్యాపారాలు చేశా. ప్రస్తుతం నా దగ్గర 5 వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు'' అన్నారు అరవింద్ స్వామి.

సమయం కేటాయించాలనుకున్నా

సమయం కేటాయించాలనుకున్నా

‘దళపతి' చేసినప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. నాకు సిగ్గెక్కువ కావడంతో ఎక్కువ సినిమాలు చెయ్యాలనుకోలేదు. స్టార్‌డమ్‌ తెచ్చుకోవాలని ఆరాటపడలేదు. సినిమా గురించి ఏమీ తెలియని నాకు మణిరత్నం అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. సినిమానే నా జీవితం అనుకోలేదు. నాకు బిజినెస్‌ ఉంది. దానిని బాగా డెవలప్‌ చెయ్యాలనుకున్నా. కుటుంబం కోసం సమయం కేటాయించాలనుకున్నా. అందుకే 1999లో సినిమాలు వదిలేసి వ్యాపారంతో బిజీ అయ్యాను.

 ధృవలో అరవింద్ స్వామి నటన గురించి..

ధృవలో అరవింద్ స్వామి నటన గురించి..

రామ్ చరణ్, అరవింద్ స్వామిల కాంబినేషన్ లో వచ్చిన ధృవ రివ్యూ ఇక్కడ చదవండి. అలాగే ఆ చిత్రంలో అరవిందద్ స్వామి నటన గురించి చూడండి.

వవహ్వా అనేంత లేదు కానీ....(రామ్ చరణ్ ‘ధృవ' రివ్యూ)

English summary
Arvind Swamy in an exclusive interview talks about his generation and now parenting the next generation, his films, luck and more. I remember I had injured my leg, I could not walk to my washroom even, I had been paralyzed but with my strong will I did participate in the half marathon and could cover 22 kilometers easily, this was a great achievement for me.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu