For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా హాళ్ళలోనే ఎందుకు? అక్కడ జాతీయగీతం ఎందుకు వెయ్యరు??: నటుడు అరవింద్ స్వామి ప్రశ్న

  |

  దేశభక్తి, జాతీయతా భావాలు ప్రతి పౌరుడిలో నిండి ఉండాలంటే జాతీయగీతాన్ని ఆల‌పించాల్సిన అవసరం ఎంత‌యినా ఉంది, దేశం ప‌ట్ల ఆరాధనా భావం, పూజనీయమైన భావం పెరిగేలా చేసేందుకు మ‌న‌ దేశ జాతీయగీతం ప్ర‌తిరోజు సినిమా హాళ్ల‌లో వినిపించాల్సిందే అంటూ గత సంవత్సరం జాతీయగీతంపై ఈ రోజు సుప్రీంకోర్టు ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం పట్ల రకరకాల అభిప్రాయాలు మొదలయ్యాయి. ఒక సంవత్సరం పాటు ఈ పద్దతిని చూసిన తర్వాత. సుప్రీం కోర్టు మళ్ళీ పునరాలోచనలో పడింది.

  National Anthem in Theatres : No Need To Stand To Prove Patriotism | Oneindia Telugu
   జాతీయ గీతం

  జాతీయ గీతం

  సినిమా థియేటర్లలో జాతీయ గీతం సందర్భంగా తప్పకుండా నిల్చోవాల్సిందేననే నిబంధనకు సుప్రీంకోర్టు సవరణ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

  నిబంధనలను సవరించాలి

  నిబంధనలను సవరించాలి

  సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు.

   అరవింద్ స్వామి

  అరవింద్ స్వామి

  అయితే మళ్ళీ ఈ సంధర్భంలో కూడా మళ్ళీ చర్చ మొదలు కావటంతో నటుడు అరవింద్ స్వామి కి మంట నశాలానికి అంటినట్టుంది. "గవర్నమెంట్ ఆఫీసులు - కోర్టులు - అసెంబ్లీలు - పార్లమెంటు హాలులో రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరు. వినోదం కోసం ఉన్న సినిమా హాళ్లలోనే జాతీయ గీతం వినిపించడం ఎందుకు తప్పనిసరి చేశారు?'' అంటూ ట్విట్టర్ వేదికగా తన సందేహం వ్యక్తం చేశాడు అరవిందస్వామి.

  దానిని గొప్పగౌరవంగా భావిస్తా

  దానిని గొప్పగౌరవంగా భావిస్తా

  జాతీయ గీతం అంటే గౌరం ఉన్నంత మాత్రాన ఎక్కడ పడితే అక్కడ సమయం సందర్భం లేకుండా పదే పదే ఆ గీతాన్ని ప్రసారం చేయటం సరైనదా? అన్న ఉద్దేశ్యం లోనే ఈ ప్రశ్న అడిగాడని అర్థం కావటానికి మళ్ళీ ఇంకో వివరణ కూడా ఇచ్చాడు. "జాతీయగీతం ఎప్పుడు వినిపించినా నేను లేచి నుంచుంటాను. నా తోటివారితో కలిసి గొంతు కలిపి జాతీయగీతం ఆలపిస్తా. దానిని గొప్పగౌరవంగా భావిస్తా'' అంటూ జనగణమన పట్ల తనకున్న గౌరవభావాన్ని కూడా ఇదే ట్వీట్ లో స్పష్టంగా చెప్పాడు.

   మీ దేశభక్తిని నిరూపించుకోండి అంటూ

  మీ దేశభక్తిని నిరూపించుకోండి అంటూ

  సో రోజుకు నాలుగుసార్లు నిలబడితేనే దేశభక్తి అనేది ఉన్నట్టు కాదనీ, జాతీయగీతాన్ని సినిమా హాళ్ళలో వేసి "మీ దేశభక్తిని నిరూపించుకోండి అంటూ టెస్ట్ పెట్టటమూ సరికాదనీ అరవింద్ స్వామి చెప్పాడన్న మాట. అరవిందస్వామి డౌట్ కూడా చాలా ఇంటెలిజింట్ గా ఉంది.

   పొద్దున్నే జాతీయ గీతం వినిపించటం

  పొద్దున్నే జాతీయ గీతం వినిపించటం

  నిజమే..! పని మధ్యలో అవినీతీ, లంచాలు లాంటి విషయాలు గుర్తు రాకుండా మన నాయకులకూ, అధికారులకూ పొద్దున్నే జాతీయ గీతం వినిపించటం ఫలితాన్నివ్వవచ్చు అంటూ ఒక అభిమాని తన అభిప్రాయాన్ని వెలి బుచ్చాడు. ... చట్టాలు చేసేవారు.. దానిని అమలు చేసేవారు రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరంటూ అతడు వ్యక్తం చేసిన డౌట్ అందరినీ ఆలోచింపజేసేదే.. అతడి డౌట్ కు మిగతా వాళ్లు ఎలా రెస్పాండవుతారో చూడాలి..

  English summary
  "Why not everyday in all govt offices, courts, before assembly and parliament sessions? ""I will always stand up for our Natl Anthem & sing along,which I do with great pride.Never understood why it ws mandatory n cinema halls only?" Questioned Aravind Swamy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X